మీకు తెలుసా?

ABN , First Publish Date - 2023-03-24T01:42:26+05:30 IST

ఈ బుల్లికోతిని ‘పిగ్మీ మార్మోసెట్‌’ అంటారు. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అడవుల్లో ఉంటుంది.

మీకు తెలుసా?

ఈ బుల్లికోతిని ‘పిగ్మీ మార్మోసెట్‌’ అంటారు. దక్షిణ అమెరికాలోని అమెజాన్‌ అడవుల్లో ఉంటుంది. అది కూడా వర్షం ఎక్కువగా పడే ప్రాంతంలోనే నివసిస్తుందిది. ముఖ్యంగా బొలివియా, ఈక్వెడార్‌, బ్రెజిల్‌, కొలంబియా, పెరు దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న కోతి.

ఇది మనిషి అరచేయి మీద కూర్చుంటే చిన్న ఉడుతలా కనిపిస్తుంది. వేగంగా ఒక కొమ్మ నుంచి మరో కొమ్మకు దూకుతుంది ఈ చిన్నకోతి. ఇది అన్నివైపులా చూడగలిగే శక్తి ఉంటుంది. తన తలను 180 డిగ్రీలు తిప్పగలదు. అలా శతృవులనుంచి తప్పించుకుంటుంది.

పండ్లు, విత్తనాలు, గింజలు, చిన్న పురుగులను తిని బతుకుతుంది. అవసరం అనుకుంటే తన పదునైన పళ్లతో పండ్లకు, చెట్లకు రంధ్రాలు చేస్తుంది.

పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్ల పొడువుంటుంది. బరువు 100 గ్రాములు మాత్రమే ఉంటుంది.ఇది గంటలకు నలభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది. కొత్త జంతువులు దరిదాపుల్లో ఉంటే అరుపులతో ఇతర పిగ్మీలను అలెర్ట్‌ చేస్తాయి. వీటి గొంతు గట్టిగా అలారమ్‌లా ఉంటుంది. ఇవి కనీసం రెండు నుంచి పదిహేను వరకూ గ్రూపులుగా బయలుదేరుతాయి. ఉదయం, మధ్యాహ్నం సమయంలో మాత్రమే చురుగ్గా ఉంటాయి.

రాత్రిపూట చెట్లుపైన చాలా ఎత్తులో నిద్రపోతాయి. పుట్టిన తర్వాత మూడునెలలకు స్వతంత్రంగా బతుకుతుంది. వీటిని ఫింగర్‌ మంకీస్‌ అని కూడా పిలుస్తారు. గాల్లో 15 ఫీట్లు ఎగరగలదు. ఇవి మనుషులతో కలసి జీవిస్తాయి.వీటికి లైఫ్‌ స్పాన్‌ పది నుంచి పన్నెండేళ్లు మాత్రమే ఉంటుంది.

Updated Date - 2023-03-24T01:42:36+05:30 IST