జ్వరంలోనూ బీర్బల్‌ హాస్యం

ABN , First Publish Date - 2023-04-04T03:22:23+05:30 IST

అక్బర్‌ ఆస్థానంలో ఉండే బీర్బల్‌ ఒక రోజు తనకి నలతగా ఉందని ఉన్నట్లుండి రాజసభనుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అక్బర్‌ ‘జాగ్రత్త’ చెప్పారు.

జ్వరంలోనూ బీర్బల్‌ హాస్యం

అక్బర్‌ ఆస్థానంలో ఉండే బీర్బల్‌ ఒక రోజు తనకి నలతగా ఉందని ఉన్నట్లుండి రాజసభనుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అక్బర్‌ ‘జాగ్రత్త’ చెప్పారు. నాలుగైదు రోజుల పాటు బీర్బల్‌ సభకు రాలేదు. సభ అంతా బోసిపోయింది. నవ్వులు లేక విలవిలాడే జనాలు ఉన్నారు ఆ సభలో. ముఖ్యంగా రాజుగారు అక్బర్‌ మాత్రం కోపంగా ఉన్నారు. పని ఒత్తిడి వల్ల వేరే చోటకు వెళ్లి వచ్చిన అక్బర్‌కు వెంటనే ఒక రోజు బీర్బల్‌ను చూడాలనిపించింది.

ఆ మరుసటి రోజు బీర్బల్‌ ఇంటికి సైన్యంతో వెళ్లాడు అక్బర్‌. బీర్బల్‌ స్థితి చూసి చలించిపోయాడు. బాధపడ్డాడు. వైద్యం తీసుకున్నా.. చిన్న జ్వరం వచ్చింది. తగ్గిపోయిందిప్పుడు. త్వరలో సభకు వస్తాను అన్నాడు. ‘మీరు లేక సభ అంతా నిశ్శబ్ధంగా ఉంది. హాస్యం లేకుండా సభలు సాగిపోతున్నాయి అన్నాడు. ఈ లోపు లోపల ఇంట్లోకి వెళ్తున్నా అని బీర్బల్‌ వెళ్లాడు. అంతలోనే అక్బర్‌ తన దిండుకింద చల్లనీళ్లతో తడిపిన ఓ రుమాలును ఉండచుట్టి ఉంచాడు. అంతలోనే బీర్బల్‌ వచ్చి అక్బర్‌తో కొద్దిసేపు మాట్లాడాడు. పడుకోమని అక్బర్‌ అన్నాడు. బీర్బల్‌ కాస్త తల వాల్చాడో లేదో ఇబ్బందికరంగా ఉన్నట్లు ఫీలయ్యాడు. ఏమైంది అన్నాడు అక్బర్‌ తెలీనట్లు. ఏదో సరిగా లేదు దిండు. ఇది వరకటి హాయి లేదు అన్నారు. ‘జ్వరం వస్తే అంతే మరి. అలాంటప్పుడు ఇబ్బందే’ అన్నాడు అక్బర్‌. క్షణాల్లో బీర్బల్‌ కలగ చేసుకుని ‘మహారాజా నాకు శరీరానికి జ్వరం వచ్చింది. మెదడుకు కాదు’ అన్నాడు. అక్బర్‌ గట్టిగా నవ్వాడు. అనారోగ్య సమయంలోనూ మీరు హాస్యాన్ని ఇంతలా పలికిస్తారు. త్వరగా కోలుకుని రాజసభకు విచ్చేయండి’ అన్నారు అక్బర్‌. ‘సరే’నన్నాడు బీర్బల్‌. ‘నేను దిండుకింద ఉండగా చుట్టిన రుమాలును తీశాడు అక్బర్‌. అది చూసి బీర్బల్‌ అవాక్కయ్యాడు. ‘మిమ్మల్ని పరీక్షిద్దామనుకున్నా. అందుకే ఇలా చేశా’ అన్నాడు అక్బర్‌. పగలబడి నవ్వాడు బీర్బల్‌. ఇద్దరూ నవ్వుకున్నారు.

Updated Date - 2023-04-04T03:22:25+05:30 IST