Binturong : మీకు తెలుసా

ABN , First Publish Date - 2023-08-29T23:18:38+05:30 IST

చెట్లమీద హుషారుగా తిరుగుతుండే ఈ జంతువు చూడటానికి పిల్లి, ఎలుగు పిల్లలా కనిపిస్తుంది. అయితే దీని పేరు ‘బింతురాంగ్‌’ అని పిలుస్తారు.

Binturong : మీకు తెలుసా

  • చెట్లమీద హుషారుగా తిరుగుతుండే ఈ జంతువు చూడటానికి పిల్లి, ఎలుగు పిల్లలా కనిపిస్తుంది. అయితే దీని పేరు ‘బింతురాంగ్‌’ అని పిలుస్తారు.

  • 2.8 ఫీట్ల పొడవు ఉంటుంది. దీని దగ్గరకు వెళ్తూనే వెన్నపూసిన పాప్‌కార్న్‌ స్మెల్‌ వస్తుంది.

  • దక్షిణ ఆసియాలోని రెయిన్‌ ఫారెస్టుల్లో జీవిస్తుంటాయివి. మనదేశంలోని నార్త్‌ ఈస్ట్‌ దేశాలతో పాటు బంగ్లాదేశ్‌, మలేషియా, ఇండియా, దక్షిణ చైనా, వియత్నాం లాంటి దేశాల్లో నివసిస్తాయి.

  • ఎప్పుడు చూసినా కొమ్మల మీద ఆడుకుంటున్నట్లే ఉంటాయి. చిటారు కొమ్మలమీదనే నడుస్తుంటాయి. ఊగుతుంటాయి. అయితే కొమ్మల మీద లేకుంటే.. పురుగులు, చిన్న పక్షులు, పళ్లు లాంటి స్నాక్స్‌ను ఎక్కడో చోట కూర్చుని తింటుంటుంది.

  • ఈ జంతువును బేర్‌క్యాట్‌ అని కూడా పిలుస్తారు. చిన్న పక్షులు గుడ్లు, ఆకులు, చేపలను తింటాయి.

  • వీటి అరుపు గట్టిగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు చెట్ల కిందికి దిగవు.

  • ఈ జంతువుకంటే పొడవుగా తోక ఉంటుంది. దీని వల్ల కొమ్మల మీద నుంచి దూకేప్పుడు స్ర్పింగ్‌లా ఉపయోగపడుతుంది.

  • ఇవి పది కేజీల నుంచి పధ్నాలుగు కేజీల బరువు ఉంటాయి.

  • మగ జంతువుల కంటే ఆడ బేర్‌క్యాట్స్‌ ఇరవైశాతం పెద్దవిగా ఉంటాయి.

  • ఇవి సులువుగా ఈదగలవు. డైవ్‌ కొట్టగలవు. ఇక వీటి దంతాలు పొడవుగా ఉంటాయి.

  • పులులు, పాములతోనే వీటికి ఇబ్బంది.

  • వీటి జీవనకాలం 18 ఏళ్లు. 30 ఏళ్ల కిందతో పోలిస్తే ఇపుడు ఇవి 30 శాతం తగ్గిపోయాయి.

Updated Date - 2023-08-29T23:18:52+05:30 IST