Bats : గబ్బిలాలు

ABN , First Publish Date - 2023-03-09T02:16:28+05:30 IST

ఒకరోజు జంతువులు, పక్షుల మధ్య గొడవ జరిగింది. మేమంటే గ్రేట్‌.. అంటూ ఎవరికి వాళ్లు అనుకుంటున్నారు. అయితే గబ్బిలాలు మాత్రం

Bats : గబ్బిలాలు

ఒకరోజు జంతువులు, పక్షుల మధ్య గొడవ జరిగింది. మేమంటే గ్రేట్‌.. అంటూ ఎవరికి వాళ్లు అనుకుంటున్నారు. అయితే గబ్బిలాలు మాత్రం జంతువులు, పక్షుల పక్కన కాకుండా తటస్థంగా ఉండాలనుకుంటున్నారు. ఈ గొడవలను చూడటానికే ఉన్నట్లు ఉన్నాయి.

కొన్ని గబ్బిలాలు ‘‘మేం పక్షుల జాతికే చెందిన వాళ్లం. గాల్లో ఎగురుతాం. పక్షుల్లానే ఉంటాం’’ అనుకున్నాయి. అయితే మరికొన్ని గబ్బిలాలు ‘‘మేం పక్షుల్లా లేము. మాకు రెక్కలు లేవు. గుడ్లు పెట్టం. మేం జంతువులకే చెందుతాం’’ అన్నాయి. ఈ గబ్బిలాలు అన్నీ మూకుమ్మడిగా మాట్లాడుకున్నాయి. మాట్లాడుతూ చర్చల్లో ‘‘మేం ఇద్దరికంటే గొప్ప. జంతువులు, పక్షులు వేటికి సంబంధించిన వాళ్లం కాము’’ అనుకున్నాయి. ఎవరికీ సపోర్ట్‌ చేయం. అయితే గెల్చినవాళ్ల పక్కన మేముంటాం అన్నాయి. ఈ మాటలన్నీ జంతువులు, పక్షులు విన్నాయి.

జంతువులు, పక్షుల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇక జంతువులు గెలుస్తాయి అనుకునే సమయంలో గబ్బిలాలన్నీ జంతువుల పక్షాన నిలిచాయి. కొద్దిసేపటి తర్వాత పక్షులదే గెలుపు అనే విషయం అర్థమై వాటినే సపోర్ట్‌ చేశాయి. కొన్నాళ్ల తర్వాత ఈ పక్షులు, జంతువులు ప్రశాంతంగా ఉన్నాయి. గొడవ పడలేదు. స్నేహితుల్లా మారిపోయాయి. అదే సమయంలో ‘గబ్బిలాలు స్వార్థపూరితమైనవి’ అంటూ జంతువులు అన్నాయి. ‘అవును. ఎవరి పక్షాన నిలబడవు. గెలిచిన వారిపక్కనే ఉంటాయి. నిజాయితీ, నమ్మకం లేని వాటిని కచ్చితంగా వెలివేయాలి’ అనుకున్నాయి రెండు జాతులు. ఆ రోజునుంచి పక్షులు, జంతువులు నివసించే రాజ్యాలను వదిలేసి చీకటి గుహల్లో, చీకటి పడినప్పుడు చెట్లకు వేలాడుతున్నాయి గబ్బిలాలు. రాత్రిపూట జంతువులు, పక్షులు నిద్రలోకి జారుకోగానే గబ్బిలాలు రాత్రంతా తిరుగుతుంటాయి.

Updated Date - 2023-03-09T02:16:28+05:30 IST