Ghost Apple: ఇలాంటి యాపిల్ పండు ఒకటుంటుందని కలలో కూడా ఊహించి ఉండరు.. తినడానికి పనికిరాదు కానీ..!
ABN , First Publish Date - 2023-12-06T11:29:10+05:30 IST
ఈ యాపిల్స్ మంచులో ఉన్నా కూడా పండక ముందే కరిగిపోతాయి.
ప్రకృతిలో అనేక వింతలు, అబ్బుర పరిచే విశేషాలు వీటిని ఒక్కసారి నమ్మడం కూడా కష్టమే. యాపిల్ పండు తెలుసుకదా.. ఆరోగ్యానికి చాలా చక్కని సపోర్ట్ గా నిలిచే యాపిల్ పండును చిన్నా, పెద్దా అంతా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. యాపిల్ లోని పోషకాలు ఆరోగ్యానికి మంచిది. రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం కూడా తక్కువగానే ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని గుణాలున్నయాపిల్ లో చాలా రకాలున్నాయి. వాటిని కూడా మనం ఇష్టంగానే తింటాం. అయితే ఇప్పుడు చెప్పుకుంటున్న యాపిల్ ఇలాంటి గుణాలున్నది కాదు. కాస్త చిత్రంగా అనిపించినా ఇది ఘోస్ట్ యాపిల్ అట. అంటే సహజంగా చెట్టుకు కాసిన పండు కాదు. ప్రకృతిలో వింతగా తయారైన యాపిల్.
ఇది ప్రపంచంలో ఎవరూ తినలేని పండు. ఈ యాపిల్ సరిగ్గా గ్లాస్‌లాగా ఉందని, ఇది చూడటానికి ఆశ్చర్యంగా ఉందని వైరల్ అవుతున్న చిత్రంలో కనిపిస్తుంది. ఈ పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు 'ఘోస్ట్ యాపిల్' దీనిలో గడ్డకట్టే వర్షం ఉన్నప్పుడు, చెట్లపై ఉన్న యాపిల్‌లపై మంచు ఘనీభవిస్తుంది. ఆ తర్వాత యాపిల్ ఈ మంచుతో నిండిన షెల్ వదిలి కింద పడిపోతుంది. ఈ దెయ్యం ఆపిల్‌లు మిచిగాన్‌లో కనిపించాయి.
1. అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన ఒక రైతు ఈ 'ఘోస్ట్ యాపిల్' గురించి సమాచారం ఇచ్చాడు.
2. ఈ ఘోస్ట్ యాపిల్ చెట్టుకు పండిన యాపిల్ కాదు..
3. యాపిల్ ఆకారంలో మంచు పేరుకుని ఇలా ఘోస్ట్ యాపిల్‌లా కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: ఇది నిజంగానే యాపిల్ ఆకారాన్ని కలిగి కనిపిస్తుంది
4. విస్మయానికి గురిచేసినా, ఇది నిజంగానే యాపిల్ ఆకారాన్ని కలిగి కనిపిస్తుంది.
5. యూఎస్ లోని పశ్చిమ మిచిగాన్‌లోని మంచుతో నిండిన తోటలో ఆండ్రూ సీట్ సెమా అనే వ్యక్తి కెమెరాలో బంధించాడు.
6. ఈ యాపిల్స్ మంచులో ఉన్నా కూడా పండక ముందే కరిగిపోతాయి. ఈ యాపిల్ చెట్టుపై వేలాడుతూ మంచుతో కప్పి కనిపిస్తుంది.
7. తినేందుకు అస్సలు పనికిరాదు. ఇలా మంచుముక్కలా కనపించడం వల్లేమో దీనికి ఘోస్ట్ యాపిల్ అనే పేరు వచ్చింది.