Fridge: ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేయాల్సి వస్తోందా..? అయితే ఫ్రిడ్జ్‌లో మాత్రం వీటిని అస్సలు ఉంచొద్దు..!

ABN , First Publish Date - 2023-09-05T12:38:12+05:30 IST

సెలవులకు వెళుతున్నట్లయితే, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలను ఫ్రిజ్ నుంచి తీసేయండి, లేదంటే తిరిగి వచ్చే సమయానికి చెడిపోయి దుర్వాసన ఫ్రిజ్ అంతా వస్తుంది. ఇది మిగిలిన వస్తువులను కూడా పాడుచేస్తుంది.

Fridge: ఎక్కువ రోజులు ఇంటికి తాళం వేయాల్సి వస్తోందా..? అయితే ఫ్రిడ్జ్‌లో మాత్రం వీటిని అస్సలు ఉంచొద్దు..!
fridge

సెలవులకు ఊరెళ్ళాలంటే ఉత్సాహంగా ఇల్లంతా సర్దుకుని వెళిపోతాం. అయితే అన్నీ సరేగానీ ఇంట్లో కూరలు, పండ్లు, పాలు, తినే పదార్థాలు ఇలా అన్నింటినీ నిలవ చేసే ఫ్రిజ్ సంగతే కాస్త తికమకలో పడేస్తుంది. అసలు ఆఫ్ చేసి వెళ్ళాలా లేక ఫ్రిజ్‌ని ఆన్ లోనే ఉంచాలా ఎవరికీ అంత త్వరగా అర్థమయ్యే విషయం కాదు. అయితే ఎక్కువ రోజులు ఊరికి వెళుతున్నాం అంటే మాత్రం ఫ్రిజ్ లో ఈ వస్తువులు, పదార్థాలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటి నుండి బయలుదేరే ముందు రిఫ్రిజిరేటర్‌ను మర్చిపోవద్దు. ఎందుకంటే, తిరిగి వచ్చిన తర్వాత, ఫ్రిజ్ దుర్వాసన రాకూడదు, ఆహారం చెడిపోకూడదు. అలా కాకూడదంటే ఈ ఐదు ముఖ్యమైన చిట్కాల గురించి తప్పక తెలుసుకోవాలి.

1. క్లీన్: సెలవులకు వెళ్లే ముందు ఫ్రిజ్‌ని శుభ్రం చేయండి. గడువు దాటిన వస్తువులను తీసివేసి, నీరు, వెనిగర్‌తో షెల్ఫ్‌లను పూర్తిగా శుభ్రం చేయండి. తిరిగి వచ్చినప్పుడు, పూర్తిగా శుభ్రమైన రిఫ్రిజిరేటర్ కనిపిస్తుంది. అంతేకాదు. జిడ్డు, మురికి పట్టకుండా, ఎప్పటిలానే తాజాగా కనిపిస్తుంది.

2. ఫ్రీజర్‌ను డీఫ్రాస్ట్ చేయండి: రిఫ్రిజిరేటర్‌లో మాన్యువల్ డీఫ్రాస్ట్ ఫ్రీజర్ కంపార్ట్‌మెంట్ ఉంటే, దానిని డీఫ్రాస్ట్ చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మంచు ఏర్పడదు, అలాగే నిల్వ తగ్గుతుంది. లేకుంటే కరెంటు వినియోగం పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: జుట్టు రాలిపోవడం కూడా ఓ సూచనే.. థైరాయిడ్ ఉందో లేదో బయటపెట్టే 6 లక్షణాలు ఇవే..!

3. కూరగాయలు,, పాలు: సుదీర్ఘ సెలవులకు వెళుతున్నట్లయితే, పాల ఉత్పత్తులు, తాజా కూరగాయలను ఫ్రిజ్ నుంచి తీసేయండి, లేదంటే తిరిగి వచ్చే సమయానికి చెడిపోయి దుర్వాసన ఫ్రిజ్ అంతా వస్తుంది. ఇది మిగిలిన వస్తువులను కూడా పాడుచేస్తుంది.


4. ఉష్ణోగ్రత: రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రతను కొద్దిగా పెంచండి. నిల్వ ఉంచిన కొన్ని వస్తువులు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఫ్రిజ్ ఎక్కువ విద్యుత్ వినియోగించదు.

5. రిఫ్రిజిరేటర్‌ను అన్‌ప్లగ్ చేయండి: చాలారోజులపాటు సెలవులకు వెళుతున్నట్లయితే. ఫ్రిజ్‌ని పూర్తిగా ఖాళీ చేసి, దాన్ని అన్‌ప్లగ్ చేస్తే మంచిది. ఎందుకంటే, దీని వల్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఎలాంటి ప్రమాదం జరుగుతుందనే భయం ఉండదు.

Updated Date - 2023-09-05T12:38:12+05:30 IST