Happy People: మీరు ఈ కేటగిరీలోని వారైతే పరవాలేదు.. లేదంటే..!

ABN , First Publish Date - 2023-03-13T10:20:04+05:30 IST

ఎటువంటి సవాళ్ళనైనా, ఎదురుదెబ్బలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.

Happy People: మీరు ఈ కేటగిరీలోని వారైతే పరవాలేదు.. లేదంటే..!
happy person

సంతోషాన్ని ఎక్కడ వెతకాలి. ఎక్కడ సంతోషాన్ని పట్టుకోవాలి అనే ప్రశ్న వేసుకుంటే సంతోషం, ఆనందం అనేవి మన తృప్తిలో వెతుక్కోవాలి. సంతోషకరమైన వ్యక్తులు జీవితం మీద సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. ప్రతికూల పరిస్థితులను సులువుగా ఎదుర్కొంటారు. నలుగురితోనూ మంచి సంబంధాలను కలిగి ఉంటారు. తమకు ఉన్నదాంట్లోనే తృప్తిగా, కృతజ్ఞతతో ఉంటారు.

సానుకూల దృక్పథం (Positive outlook) : సంతోషకరమైన వ్యక్తులు జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. చెడు కంటే మంచి విషయాలపై దృష్టి పెడతారు. ఎటువంటి సవాళ్ళనైనా, ఎదురుదెబ్బలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.

మంచి సంబంధాలు (Good relationships): సంతోషంగా ఉండే వ్యక్తులు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. అటు సమాజంతోనూ, ఇటు కుటుంబంతోనూ మంచి ఆత్మీయమైన సంబంధాలు కలిగి ఉంటారు.

ఉద్దేశ్యాలు మెరుగ్గా ఉంటాయి: ఎప్పుడైతే మనసులో ఆనందం నిండి ఉంటుందో వాళ్ళు ఆలోచించే తీరు కూడా నిర్మలంగా ఉంటుంది. ఎదుటివారికి సాయం చేయాలని ఆలోచిస్తారు.

ఒత్తిడి మంత్రం: ఇలాంటి నిర్మలమైన ఆలోచనలున్నవారు, ఎదురుదెబ్బలకు తిరిగి పుంజుకుంటారు. ఒత్తిడిని, సవాళ్ళను ఎదుర్కోగలుగుతారు.

క్రమశిక్షణ (Self-care): ఇలాంటి వారు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. బాగా తింటారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు, తగినంత నిద్ర పొందుతారు.ఆనందాన్ని పంచే విషయాల్లో పాల్గొంటారు.

సాయం చేయాలనే ఆలోచన; నలుగురికి సాయం చేయడం అనేది అందరిలోనూ ఉండే గుణం కాదు. దానికి నిర్మలమైన ఆలోచన, మనస్సు, ఎదుటివారి అవసరాన్ని అర్థం చేసుకునే ఆలోచన ఉండాలి.

Updated Date - 2023-03-13T10:20:04+05:30 IST