ప్రపంచంలోనే దుర్భర దేశంగా జింబాబ్వే

ABN , First Publish Date - 2023-05-25T02:50:12+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత దుర్భరదేశాల జాబితాలో జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 157 దేశాలకు ప్రసిద్ధ ఆర్థిక వేత్త స్టీవ్‌ హాంకీ రూపొందించిన వార్షిక దుర్భర సూచీ(హెచ్‌ఏఎంఐ)లో ఈ మేరకు వెల్లడైంది. దేశా

ప్రపంచంలోనే దుర్భర దేశంగా జింబాబ్వే

103వ స్థానంలో భారత్‌.. హెచ్‌ఏఎంఐ సూచీలో వెల్లడి

న్యూఢిల్లీ, మే 24: ప్రపంచంలోనే అత్యంత దుర్భరదేశాల జాబితాలో జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 157 దేశాలకు ప్రసిద్ధ ఆర్థిక వేత్త స్టీవ్‌ హాంకీ రూపొందించిన వార్షిక దుర్భర సూచీ(హెచ్‌ఏఎంఐ)లో ఈ మేరకు వెల్లడైంది. దేశాల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా తయారైన ఈ జాబితా వివరాలను న్యూయార్క్‌ పోస్ట్‌ ప్రచురించింది. ఉక్రెయిన్‌, సిరియా, సూడాన్‌ వంటి దేశాలను కూడా జింబాబ్వే ఈ సూచీలో దాటేయడం గమనార్హం. ఇక భారత్‌ ఈ జాబితాలో 103వ స్థానంలో, అమెరికా 134వ స్థానంలో ఉన్నాయి. గడచిన ఆరేళ్లుగా ప్రపంచంలోనే సంతోషకరమైన దేశంగా ఉన్న ఫిన్లాండ్‌, ఈసారి దుర్భర దేశాల జాబితాలో 109వ స్థానంలో నిలవడం ఆసక్తికరం. స్విట్జర్లాండ్‌ పౌరులు అత్యంత సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో కువైత్‌, ఐర్లాండట్‌, జపాన్‌, మలేసియా, తైవాన్‌, నైగర్‌, థాయ్‌లాండ్‌, టోగో, మాల్టా దేశాలున్నాయి.

Updated Date - 2023-05-25T02:50:12+05:30 IST