మీ నిర్ణయం బాగుంది.. అండగా ఉంటా!

ABN , First Publish Date - 2023-04-22T04:19:21+05:30 IST

ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆదేశించినప్పటికీ ఇంకా బీజేపీలోనే కొనసాగుతూ, పార్టీ కోసం పనిచేస్తున్న కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్పకు ప్రధాని ఫోన్‌ చేసి పలకరించారు. ‘‘టికెట్‌

మీ నిర్ణయం బాగుంది.. అండగా ఉంటా!

టికెట్‌ దక్కని మాజీ మంత్రి ఈశ్వరప్పకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా

బెంగళూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆదేశించినప్పటికీ ఇంకా బీజేపీలోనే కొనసాగుతూ, పార్టీ కోసం పనిచేస్తున్న కర్ణాటక మాజీ మంత్రి ఈశ్వరప్పకు ప్రధాని ఫోన్‌ చేసి పలకరించారు. ‘‘టికెట్‌ ఇవ్వకపోయినా మీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేనందుకు సంతోషిస్తున్నా. మీ తీరు స్ఫూర్తిదాయకం. మీరు పార్టీ కోసం పని చేయండి. మీకు అండగా నేనున్నా’’ అని ప్రధాని భరోసా ఇచ్చారు. టికెట్లు రాకపోవడంతో మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణసవది కాంగ్రె్‌సలో చేరారు. ఈశ్వరప్ప మాత్రం పార్టీ ఫిరాయించేది లేదని స్పష్టం చేశారు. ప్రధాని హామీని బట్టి ఈశ్వరప్పకు త్వరలోనే కీలక హోదా దక్కుతుందని భావిస్తున్నారు.

కాగా మాజీ మంత్రి ఈశ్వరప్పను ప్రధాని మోదీ అభినందించడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీ్‌పసింగ్‌ సుర్జేవాలా తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని అభినందనలు 40ు కమీషన్‌ అవినీతికా? కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ ఆత్మహత్య చేసుకునేందుకు కారకుడైనందుకా?అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, కర్ణాటకలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే సీఎం పదవిని దక్కించుకునేందుకు 10 మంది వరకు పోటీ పడుతున్నారని సుర్జేవాలా ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్‌ సంతోశ్‌, సీటీ రవి, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజె, రాష్ట్ర మంత్రి మురుగేశ్‌ నిరాణి తదితరుల పేర్లను ప్రస్తావించారు. కర్ణాటకలో అనైతిక రాజకీయాలకు తెరలేపిన బీజేపీ.. ప్రస్తుతం తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతోందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదన్నారు.

Updated Date - 2023-04-22T04:19:21+05:30 IST