చిరుధాన్యాల సంవత్సరం లోగో విడుదల
ABN , First Publish Date - 2023-01-21T10:05:47+05:30 IST
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరానికి సంబంధించి కేంద్రప్రభుత్వ లోగోను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ప్రధానమంత్రి
ఐసిఎఫ్(చెన్నై), జనవరి 20: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరానికి సంబంధించి కేంద్రప్రభుత్వ లోగోను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విజ్ఞప్తి మేరకు ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఈ ఉత్పత్తి పెంచేందుకు తమిళనాడు సహా 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై రైతులు, ప్రజలకు అవగాహన కలిగించేలా కేంద్రప్రభుత్వం విడుదల చేసిన లోగోలో సజ్జ, జొన్న, రాగి, కంకుల నమూనాలు న్నాయి. ఆంగ్లంలో ఉన్న అక్షరాలను తమిళంలో మార్చి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ లోగో విడుదల చేసింది.