ప్రసాదం తిని మహిళ మృతి
ABN , Publish Date - Dec 26 , 2023 | 12:51 AM
బెంగళూరు గ్రామీణ జిల్లా హొస్కోటెలో హనుమద్‌వ్రతం సందర్భంగా కోటె ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదం తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మంది తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
హొస్కోటె ఆలయంలో ఘటన
బెంగళూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు గ్రామీణ జిల్లా హొస్కోటెలో హనుమద్‌వ్రతం సందర్భంగా కోటె ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదం తిని ఓ మహిళ మృతి చెందింది. మరో 15 మంది తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. హొస్కోటెలోని కావేరినగర్‌కు చెందిన శివన్న భార్య సిద్దగంగమ్మకు(60) ఆలయంలో ఆదివారం ప్రసాదం తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. ప్రసాదం తిన్నవారిలో మరో 15 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో హొస్కోటెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.