ప్రియుడితో భార్య, ప్రియుడి భార్యతో భర్త జంప్‌!

ABN , First Publish Date - 2023-02-28T03:42:58+05:30 IST

తన భార్య ఏ ప్రియుడితో ఇల్లు వదిలి పరారైందో, అదే ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు బిహార్‌కు చెందిన ఓ భర్త. వినడానికే కొంచెం తికమకగా అనిపించే ఆ ఆసక్తికర ఘటన, ఖగారియాలోని హార్దియా గ్రామంలో జరిగింది.

ప్రియుడితో భార్య, ప్రియుడి భార్యతో భర్త జంప్‌!

పట్నా, ఫిబ్రవరి 27: తన భార్య ఏ ప్రియుడితో ఇల్లు వదిలి పరారైందో, అదే ప్రియుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు బిహార్‌కు చెందిన ఓ భర్త. వినడానికే కొంచెం తికమకగా అనిపించే ఆ ఆసక్తికర ఘటన, ఖగారియాలోని హార్దియా గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నీరజ్‌ కుమార్‌కు 14ఏళ్ల క్రితం రూబీ దేవితో వివాహం జరిగింది. వారిద్దరికీ నలుగురు పిల్లలు జన్మించారు. అయితే, రూబీ పెళ్లికి ముందు నుంచే ముఖేశ్‌ కుమార్‌తో ప్రేమలో ఉంది. మరోవైపు ముఖేశ్‌ కూడా రూబీ అన్న పేరు గల యువతినే కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా నడుస్తుండగా.. గత ఏడాది ఫిబ్రవరి 6న నీరజ్‌ భార్య రూబీ, తన ప్రియుడు ముఖేశ్‌తో కలిసి పారిపోయింది. ఇటు భార్యను, అటు భర్తను పోగొట్టుకుని, చుట్టుపక్కల వారి మాటలతో బాధలో ఉన్న నీరజ్‌, ముఖేశ్‌ భార్య రూబీలకు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ ఈ నెల 18న కోర్టు అనుమతితో పెళ్లి చేసుకున్నారు.

Updated Date - 2023-02-28T03:42:58+05:30 IST