శ్రద్ధా ఓ స్నేహితుణ్ని కలవడంతో.. కిరాతకుడిలా మారిన అఫ్తాబ్‌

ABN , First Publish Date - 2023-01-25T01:04:06+05:30 IST

శ్రద్ధా తన స్నేహితుణ్ని కలవడంతో అఫ్తాబ్‌ కిరాతకుడిలా మారి, ఆమెను హత్య చేశాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దేశ రాజధానిలో శ్రద్ధావాకర్‌ అనే యువతిని

శ్రద్ధా ఓ స్నేహితుణ్ని కలవడంతో.. కిరాతకుడిలా మారిన అఫ్తాబ్‌

ఢిల్లీ పోలీసుల వెల్లడి..6629 పేజీల చార్జ్‌షీట్‌

న్యూఢిల్లీ, జనవరి 24: శ్రద్ధా తన స్నేహితుణ్ని కలవడంతో అఫ్తాబ్‌ కిరాతకుడిలా మారి, ఆమెను హత్య చేశాడని ఢిల్లీ పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. దేశ రాజధానిలో శ్రద్ధావాకర్‌ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్‌ పూనావాల అతి కిరాతకంగా నరికి చంపి, ఆమె శరీర భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పడేసిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడిపై ఢిల్లీ పోలీసులు మొత్తం 6629 పేజీల చార్జ్‌షీట్‌ను నమోదు చేశారు. అతడి కస్టడీ మంగళవారం ముగియడంతో సాకేత్‌ కోర్టు న్యాయమూర్తి అవిరాల్‌ శుక్లా ఎదుట అఫ్తాబ్‌ను వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. అతడిపై నమోదు చేసిన చార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేశారు. దానిని చూసిన జడ్జి అందులో ఎన్ని పేజీలు ఉన్నాయని ప్రశ్నించగా... 6629 పేజీల చార్జ్‌షీట్‌ను నమోదుచేసినట్లు పోలీసులు సమాధానమిచ్చారు. అది భారీ చార్జిషీట్‌ అని, ఎట్టకేలకు ఆ చార్జ్‌షీట్‌ నేడు కోర్టుకు చేరిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అఫ్తాబ్‌ జ్యుడీషియల్‌ కస్టడీని మరో రెండువారాలు(ఫిబ్రవరి 7 వరకు) పొడిగించారు.

Updated Date - 2023-01-25T01:04:06+05:30 IST