Internet : సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేస్తాం
ABN , Publish Date - Dec 26 , 2023 | 01:05 AM
హమా్‌సకు మద్దతుగా ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ మద్దతిచ్చే దేశాల వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ ఉగ్రవాదులు తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నాలు జరుగుతుండడంతో..
ప్రపంచం నెట్‌కు దూరమవుతుంది.. హెచ్చరికలు జారీ చేసిన హౌతీలు
భారత్‌కు చాలా ప్రత్యామ్నాయాలున్నాయి
డీవోటీ విజిలెన్స్ విశ్రాంత అధికారి మార్షల్
హమా్‌సకు మద్దతుగా ఎర్రసముద్రంలో ఇజ్రాయెల్ మద్దతిచ్చే దేశాల వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ ఉగ్రవాదులు తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సైనిక బలగాలు ఎర్ర సముద్రంలో మోహరించే ప్రయత్నాలు జరుగుతుండడంతో.. ఇంటర్నెట్ వ్యవస్థపై దాడి చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం బాబ్ అల్-మందబ్ జలసంధి మీదుగా సముద్ర భూగర్భం నుంచి వెళ్తున్న ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని స్పష్టం చేశారు. అదే జరిగితే ప్రపంచానికి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేశారు. అమెరికా నిర్ణయానికి ఇటలీ, స్పెయిన్ మద్దతిస్తాయనే వార్తలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో హౌతీ ఉగ్రవాదులు పేర్కొన్నారు. ‘‘తాము తీసుకునే నిర్ణయంతో ప్రపంచం నిజమైన రాతియుగంలోకి వెళ్లిపోతుంది. ఇక కాచుకోండి’’ అంటూ సవాల్ విసిరారు. దీనిపై అరబ్, అంతర్జాతీయ మీడియా పలు కథనాలను ప్రచురించాయి. హౌతీలను కట్టడి చేయకుంటే.. ప్రపంచానికి నెట్‌వర్క్ సమస్య ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. హౌతీలు సముద్ర గర్భంలోని కేబుళ్లను కట్ చేసినా.. పెద్దగా ప్రమాదమేమీ ఉండదని భారత టెలీకమ్యూనికేషన్ శాఖ(డీవోటీ) విజిలెన్స్ విభాగం మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సెనెగల్‌లో భారత ప్రభుత్వం చేపట్టిన ‘పాన్-ఆఫ్రికా’ ఇంటర్నెట్ ప్రాజెక్టు విశ్రాంత డైరెక్టర్ జార్జి మార్షల్ స్పష్టం చేస్తున్నారు. హౌతీల బెదిరింపు ప్రకటనపై మార్షల్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. ప్రస్తుతమున్న వనరులతో ఎక్కడా ఇంటర్నెట్‌కు ఇబ్బంది లేకుండా చేయవచ్చని వివరించారు. ‘‘ముఖ్యంగా భారత్‌కు దీని ప్రభావం ఉండబోదు. సముద్ర గర్భంలో ఒకే లైన్‌లో ఇంటర్నెట్ ఫైబర్ కేబుల్ వ్యవస్థ లేదు. దేశాల మధ్య వేర్వేరు సంస్థలకు చెందిన కేబుళ్లున్నాయి. ఉదాహరణకు.. భారత్‌కు చెన్నై, పుదుచ్చేరి, కోల్‌కతా, ముంబై వంటి పోర్టుల వద్ద అంతర్జాతీయ ఇంటర్నెట్ హబ్‌లు ఉన్నాయి. ముంబై-హైదరాబాద్ లైన్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. సర్వీస్ ప్రొవైడర్లు వెంటనే చెన్నై లేదా కోల్‌కతా హబ్ నుంచి డేటాను యాక్సెస్ చేస్తారు. అంతేకాదు.. అర్జెంటీనా లాంటి పలు దేశాల నుంచి మన హబ్‌లకు అత్యవసర ఇంటర్నెట్ కనెక్టివిటీకి అవకాశాలున్నాయి’’ అని తెలిపారు.
- గాజాలో 166 మంది మృతి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో సోమవారం ఉదయానికి(గడిచిన 24 గంటల్లో) 166 మంది పౌరులు మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. శరణార్థి శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సేనలు కాల్పులకు తెగబడుతున్నాయని ఆరోపించింది. సెంట్రల్ గాజాలోని మాఘాజీ శిబిరంపై జరిపిన దాడిలో 60 మంది మృతిచెందారని, దక్షిణ ఖాన్‌యూని్‌సలో జరిగిన షెల్లింగ్‌లో 18 మంది దుర్మరణంపాలయ్యారని ప్రకటించింది. తాజా మరణాలతో చనిపోయిన పౌరుల సంఖ్య 20,424కు పెరిగింది. కాగా, ఇజ్రాయెల్ సిరియాపై జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ జనరల్ చనిపోయినట్లు సమాచారం.
సెంట్రల్ డెస్క్