రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
ABN , First Publish Date - 2023-07-21T03:26:18+05:30 IST
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్ చైర్మన్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. ఈ ప్యానెల్‌ను జూలై 17న పునర్వ్యవస్థీకరించినట్లు సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గురువారం
న్యూఢిల్లీ, జూలై 20: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్ చైర్మన్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. ఈ ప్యానెల్‌ను జూలై 17న పునర్వ్యవస్థీకరించినట్లు సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ గురువారం సమాచారం ఇచ్చారు. వారిలో సగంమంది మహిళలు ఉన్నారు. కొత్త వైస్ చైర్మన్లుగా ఎంపికైన సభ్యుల్లో విజయసాయిరెడ్డితో పాటు పి.టి. ఉష, ఎస్. ఫాంగ్నోన్ కోన్యాక్, ఫౌజియా ఖాన్, సులతా దేవ్, ఘనశ్యామ్ తివారీ, హనుమంతయ్య, సుఖేందు శేఖర్ రే ఉన్నారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేని సమయంలో వీరిలో ఒకరు సభను నడుపుతారు.