Share News

Vijay Diwas 2023: విజయ్ దివస్ సందర్భంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలు

ABN , Publish Date - Dec 16 , 2023 | 08:51 AM

పాకిస్థాన్ పై విజయం సాధించినందుకు గుర్తుగాను ఏటా డిసెంబర్ 16న భారత్ విజయ్ దివస్(Vijay Diwas 2023) ను జరుపుకుంటుంది. ఇవాళ దేశ చరిత్రలో మరువరాని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది.

Vijay Diwas 2023: విజయ్ దివస్ సందర్భంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలు

ఢిల్లీ: పాకిస్థాన్ పై విజయం సాధించినందుకు గుర్తుగాను ఏటా డిసెంబర్ 16న భారత్ విజయ్ దివస్(Vijay Diwas 2023) ను జరుపుకుంటుంది. ఇవాళ దేశ చరిత్రలో మరువరాని రోజు. 1971 యుద్ధంలో భారత్ పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఇలాంటి చరిత్రాత్మక రోజు గురించి తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన అంశాలివి...

1. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో భారతదేశం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్ జరుపుకుంటారు.

2. ఈ వివాదం డిసెంబర్ 3, 1971న ప్రారంభమై.. 13 రోజుల పాటు కొనసాగింది. భారత్, బంగ్లాదేశ్ ఉమ్మడి దళాలకు పాకిస్తాన్ తూర్పు కమాండ్ లొంగిపోవడంతో యుద్ధం ముగిసింది.

3. యుద్ధం ఫలితంగా తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పశ్చిమ పాకిస్తాన్ నుండి విముక్తి పొందింది. ఇది బంగ్లాదేశ్(Bangladesh) అనే కొత్త దేశం ఏర్పడటానికి దారి తీసింది.

4. డిసెంబర్ 16, 1971న అప్పటి పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఎ.ఎ.కె. నియాజీ ఢాకాలో భారత సైన్యానికి లొంగిపోయాడు.

5. ముక్తి బాహిని (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధులు)తో పాటు భారతదేశ సైనిక బలగాలు బంగ్లాదేశ్‌కి స్వాతంత్ర్యం సిద్ధించడానికి కృషి చేశాయి.


6. యుద్ధం భారీ మానవతా సంక్షోభానికి దారి తీసింది. యుద్ధం కారణంగా లక్షలాది మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చేశారు.

7. 1971 యుద్ధ సమయంలో, భారత సైన్యం జనరల్ సామ్ మానెక్షా నాయకత్వంలో ఉంది. యుద్ధంలో విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

8. యుద్ధంలో పోరాడిన సైనికుల ధైర్యం, త్యాగం, ధైర్యసాహసాలను గుర్తు చేసుకుంటూ అమరవీరులకు నివాళులర్పించే రోజుగా విజయ్ దివస్ ని జరుపుకుంటాం.

9. వేడుకలు, కవాతులు తదితర కార్యక్రమాలు భారత్ అంతటా జరుపుకుంటారు. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతాలో విజయ్ దివస్‌ను ఘనంగా జరుపుకుంటారు.

10. 1971 యుద్ధంలో విజయం భారత సైనిక సామర్థ్యాలు బలపరుచుకునేందుకు ఉపయోగపడింది. భారత చరిత్రలో ఒక ముఖ్య అధ్యయంగా నిలిచిపోయింది.

Updated Date - Dec 16 , 2023 | 08:51 AM