Arvind Kejriwal: లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి సీఎం బంగళా పునర్నిర్మాణ విజిలెన్స్ నివేదిక

ABN , First Publish Date - 2023-05-26T12:50:56+05:30 IST

ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యత్నిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం ఇంటి పునర్ నిర్మాణ పనులపై దృష్టి సారించారు....

Arvind Kejriwal: లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి సీఎం బంగళా పునర్నిర్మాణ విజిలెన్స్ నివేదిక
Vigilance Report To LG Saxena

న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ యత్నిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీఎం ఇంటి పునర్ నిర్మాణ పనులపై దృష్టి సారించారు.(Arvind Kejriwal)ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ బంగ్లా పునరుద్ధరణపై విజిలెన్స్ నివేదిక(Vigilance Report) ఎల్‌జి సక్సేనాకు అందింది.2020 వ సంవత్సరం మార్చిలో అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి సీఎం ఇంట్లో అదనపు వసతి ఏర్పాట్లను ప్రతిపాదించారు.(Delhi CM's Bungalow Renovation) డ్రాయింగ్ రూమ్, రెండు మీటింగ్ రూమ్‌లు, 24 మంది కెపాసిటీ ఉన్న డైనింగ్ రూమ్ పునర్నిర్మించడం ద్వారా పై అంతస్తును అదనంగా చేర్చారు. ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించిన వాస్తవ నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణకు మొత్తం రూ.52.71 కోట్లు వెచ్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రూ.52.71 కోట్లలో ఇంటి నిర్మాణానికి రూ.33.49 కోట్లు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రూ.19.22 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) రికార్డులను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

భారతీయ జనతా పార్టీ గత తొమ్మిదేళ్లుగా కేజ్రీవాల్ ప్రతిష్ఠను దిగజార్చడానికి చేసిన అన్ని ప్రయత్నాలలో విఫలమైన తరువాత, ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసాన్ని లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పునరుద్ధరించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఎల్‌జీ వీకే సక్సేనా సంబంధిత ఫైళ్లన్నింటినీ భద్రపరచి వాస్తవ నివేదికను సమర్పించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను ఏప్రిల్‌లో ఆదేశించారు.ప్రత్యేక కార్యదర్శి (విజిలెన్స్) వైవివిజె రాజశేఖర్ సంతకం చేసిన నివేదికను ఎల్‌జికి సమర్పించారు.కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక శాఖ 2020 ఆర్డర్‌కు వ్యతిరేకంగా నిర్మాణ పనులు చేశారని బీజేపీ ఆరోపించింది.

Updated Date - 2023-05-26T12:50:56+05:30 IST