Vande Bharat train: చివరి దశలో 8వ వందేభారత్ రైలు తయారీపనులు
ABN , First Publish Date - 2023-01-10T09:21:47+05:30 IST
స్థానిక పెరంబూర్ సమీపంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ రైళ్లు(Vande Bharat Trains) రూపొందుతున్నాయి.
పెరంబూర్(చెన్నై): స్థానిక పెరంబూర్ సమీపంలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్ రైళ్లు(Vande Bharat Trains) రూపొందుతున్నాయి. ఇప్పటివరకు ఏడు వందే భారత్ రైళ్ల తయారీ పూర్తికాగా, ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-ఖత్రా, గాంధీ నగర్-ముంబై, ఢిల్లీ-యూనా, చెన్నై-మైసూర్, బిలా్‌సపూర్-నాగపూర్, హౌరా-న్యూ జబల్‌పురి మధ్య నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఐసిఎ్‌ఫలో 8వ వందే భారత్ రైలు తయారీపనులు మరో రెండు, మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఈ నెల మూడవ వారం నుంచి నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.