Share News

గల్ఫ్‌ భారతీయ కార్మికుల్లో అగ్రస్థానం యూపీదే

ABN , First Publish Date - 2023-11-18T04:59:28+05:30 IST

గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికుల్లో అగ్రస్థానంలో ఉండే కేరళ ఇప్పుడు వెనకబడి పోయింది. ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలు ఆక్రమించాయి.

గల్ఫ్‌ భారతీయ కార్మికుల్లో అగ్రస్థానం యూపీదే

మూడో స్థానానికి పడిపోయిన కేరళ

ముంబై, నవంబరు 17: గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికుల్లో అగ్రస్థానంలో ఉండే కేరళ ఇప్పుడు వెనకబడి పోయింది. ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలు ఆక్రమించాయి. ఈ మేరకు యూఏఈకి చెందిన కార్మికుల ప్లేస్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ హంటర్‌ నివేదిక వెల్లడించింది. యూపీ, బిహార్‌, కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాలు గల్ఫ్‌ దేశాలకు కార్మికులను పంపే టాప్‌-5 రాష్ట్రాలుగా పేర్కొంది. భారత్‌ నుంచి దుబాయ్‌ వెళ్లే శ్రామిక శక్తిలో 20-40 వయసు గ్రూప్‌ వారే అధికమని స్పష్టం చేసింది. సాధారణంగా వలస వెళ్లే కార్మికుల్లో పురుషులే అధికంగా ఉండటం పరిపాటని, ఇటీవల మహిళా కార్మికుల సంఖ్య పెరిగిందని.. ముఖ్యంగా ఆతిథ్య రంగంలో వీరి సంఖ్య బాగా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.

Updated Date - 2023-11-18T04:59:29+05:30 IST