Union Minister: నూతన విద్యావిధానంతో మాతృభాషకు పట్టం

ABN , First Publish Date - 2023-02-02T07:56:25+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానం మాతృభాషకు పట్టం కడుతుందని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌(Union Minister L. Murugan)

Union Minister: నూతన విద్యావిధానంతో మాతృభాషకు పట్టం

- జీ-20 సదస్సులో కేంద్రమంత్రి మురుగన్‌

చెన్నై, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానం మాతృభాషకు పట్టం కడుతుందని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌(Union Minister L. Murugan) పేర్కొన్నారు. జీ-20 ప్రతినిధులు హాజరైన రెండో రోజు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నుంగంబాక్కంలోని స్టార్‌హోటల్‌లో నిర్వహించిన సదస్సుకు 29 దేశాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు సహా సుమారు 900 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మురుగన్‌ మాట్లాడుతూ... జీ-20 దేశాలకు భారతదేశం నాయకత్వం వహించడం దేశ ప్రజలంతా గర్వించదగిన విషయమన్నారు. ప్రాంతీయ సదస్సుల ద్వారా విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. ప్రతినిధుల ప్రసంగాల ద్వారా ఆయా దేశాల్లో చోటుచేసుకున్న విద్య, ఆరోగ్య, వైద్య రంగాలలో మార్పులను, కొత్త సాంకేతిక విషయాలను తెలుసుకోగలుగుతారన్నారు. మూడు రోజుల సదస్సును చెన్నైలో నిర్వహించడం తమకెంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందన్నారు. కేంద్ర మానవవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌మూర్తి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి సంజయ్‌మూర్తి, ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ కామకోటి, పాఠశాలల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్‌ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ అధ్యక్షుడు అనిల్‌ సహస్రాబ్దే తదితరులు సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

Updated Date - 2023-02-02T07:56:27+05:30 IST