అమెరికాలో రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఢీ

ABN , First Publish Date - 2023-03-31T03:22:54+05:30 IST

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్‌ ఆర్మీకి చెందిన రెండు హెచ్‌హెచ్‌- 60 బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు పరస్పరం ఢీకొని 9 మంది ..

అమెరికాలో రెండు ఆర్మీ హెలికాప్టర్లు ఢీ

9 మంది సైనికుల మృతి

కెంటకీ, మార్చి 30: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్‌ ఆర్మీకి చెందిన రెండు హెచ్‌హెచ్‌- 60 బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు పరస్పరం ఢీకొని 9 మంది సైనికులు మృతి చెందారు. కెంటకీ రాష్ట్రంలోని ట్రిగ్‌కంట్రీలో, 101వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌ మిలటరీ బేస్‌లో బుధవారం రాత్రి సైనికులకు శిక్షణ ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్మీ బ్రిగేడర్‌ జనరల్‌ జాన్‌ లుబాస్‌ తెలిపారు. ఆ సమయంలో శిక్షణలో భాగంగా సైనికులు నైట్‌మోడ్‌ గాగుల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొనడమే ప్రమాదానికి కచ్చితమైన కారణంగా చెప్పలేమని, బ్లాక్‌బాక్సులు లభ్యమైతేనే అసలు విషయం బయటపడుతుందని అన్నారు.

Updated Date - 2023-03-31T03:22:54+05:30 IST