ఆకాశంలో విమానం డోరు తెరిచే యత్నం

ABN , First Publish Date - 2023-09-22T02:50:09+05:30 IST

గాలిలో ఎగురుతున్న విమానం డోరును తెరిచేందుకు ప్రయత్నించింన ఓ ప్రయాణికుడ్ని దేహశుద్ధి చేసి అరెస్టు చేసిన ఘటన గురువారం అగర్తలాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి గువాహటీ మీదుగా అగర్తలా

ఆకాశంలో విమానం డోరు తెరిచే యత్నం

ప్రయాణికుడికి దేహశుద్ధి, అరెస్టు

అగర్తలా, సెప్టెంబరు 21: గాలిలో ఎగురుతున్న విమానం డోరును తెరిచేందుకు ప్రయత్నించింన ఓ ప్రయాణికుడ్ని దేహశుద్ధి చేసి అరెస్టు చేసిన ఘటన గురువారం అగర్తలాలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి గువాహటీ మీదుగా అగర్తలా వచ్చిన ఇండిగో విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ దుందుడుకు చర్యకు పాల్పడిన ప్రయాణికుడ్ని తూర్పు అగర్తలాలోని జిరానియా ప్రాంతానికి చెందిన బిశ్వజిత్‌ దేబ్‌నాథ్‌ (41)గా గుర్తించారు. అగర్తలాలో ఆ విమానం కిందికి దిగడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆకస్మాత్తుగా వెళ్లి ముందు డోర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. ముప్పును గమనించిన ఎయిర్‌ హోస్టె్‌సతో పాటు ఇతర సిబ్బంది వెంటనే వెళ్లి అతడ్ని అడ్డుకున్నారు. తోటి ప్రయాణికులు కూడా వచ్చి వెనక్కిలాగారు. అయినా డోర్‌ను తెరవడానికి ప్రయత్నిస్తుండడంతో ఆగ్రహం చెందిన మిగతా ప్రయాణికులు అతడికి దేహశుద్ధి చేశారు. విమానం కిందికి దిగగానే పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-09-22T02:50:09+05:30 IST