గ్రీస్‌లో రైళ్లు ఢీకొని 36 మంది సజీవదహనం

ABN , First Publish Date - 2023-03-02T01:48:05+05:30 IST

గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజరు రైలు, గూడ్స్‌ రైలు ఢీకొని మంటలు చెలరేగాయి. దాంతో 36 మంది సజీవ దహనమవ్వగా

గ్రీస్‌లో రైళ్లు ఢీకొని 36 మంది సజీవదహనం

టెంపే, మార్చి 1: గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్యాసింజరు రైలు, గూడ్స్‌ రైలు ఢీకొని మంటలు చెలరేగాయి. దాంతో 36 మంది సజీవ దహనమవ్వగా, 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోరం మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో జరిగింది. 350 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ప్యాసింజరు రైలు ఎదురుగా వస్తున్న గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. దీంతో ప్యాసింజరు రైల్లోని మూడు బోగీల్లో మంటలు చెలరేగగా, కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. మృతుల్లో రెండు రైళ్ల డ్రైవర్లు సహా ఎనిమిది మంది రైల్వే సిబ్బంది ఉన్నారు. కాగా, ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. వారు కార్నివాల్‌ వేడుకలు జరుపుకొని ఇంటికి వెళ్తుండగా ఈ విషాద ఘటన జరిగింది.

Updated Date - 2023-03-02T01:48:05+05:30 IST