ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్

ABN , First Publish Date - 2023-06-02T20:46:45+05:30 IST

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) రైలు ఢీకొట్టింది. స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్

విశాఖ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express) రైలు ఢీకొట్టింది. స్టేషన్‌లో ఆగివున్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి 5 బోగీలు పల్టీ కొట్టాయి. ప్రమాదంలో 50 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో చెల్లాచెదురుగా ప్రయాణికులు పడ్డారు. ప్రయాణికులు భయంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. బాలాసోర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. బాలేశ్వర్ జిల్లా బహనాగ్ రైల్వేస్టేషన్‌ (Bahanag Railway Station)లో ఘటన జరిగింది. క్షతగాత్రులను తరలించేందుకు భద్రక్ నుంచి ఐదు అంబులెన్స్‌లను తరలించారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నంబర్ 06782262286కు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. రైలు ప్రమాదంపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-06-02T20:53:41+05:30 IST