నేడే ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగం

ABN , First Publish Date - 2023-03-26T00:44:53+05:30 IST

అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం3ను ఇస్రో ఆదివారం ప్రయోగించనుంది. ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ ..

నేడే ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ ప్రయోగం

సూళ్లూరుపేట, మార్చి 25: అంతరిక్షంలోకి 36 ఉపగ్రహాలను మోసుకువెళ్లే భారీ రాకెట్‌ ఎల్‌వీఎం3-ఎం3ను ఇస్రో ఆదివారం ప్రయోగించనుంది. ఉదయం 9 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగవేదిక నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. యూకేకి చెందిన 5805 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలతో సిద్ధమైన రాకెట్‌ కౌంట్‌డౌన్‌ శనివారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ షార్‌కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్‌, శాస్త్రవేత్తలతో కలిసి సందర్శించారు. రాకెట్‌ విజయం కోసం ఇస్రో చైర్మన్‌ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ వారికి పూజలు చేశారు.

Updated Date - 2023-03-26T00:44:53+05:30 IST