ప్రపంచ ఆహార భద్రతకు చిరుధాన్యాలే పరిష్కారం

ABN , First Publish Date - 2023-03-19T01:26:13+05:30 IST

ప్రపంచ ఆహార భద్రత సవాళ్లకు చిరుధాన్యాలు పరిష్కారంగా నిలుస్తాయని ప్రధాని మోదీ శనివారం స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు కూడా ఇవి ఉపకరిస్తాయని ఆయన గుర్తుచేశారు.

ప్రపంచ ఆహార భద్రతకు   చిరుధాన్యాలే పరిష్కారం

న్యూఢిల్లీ, మార్చి 18: ప్రపంచ ఆహార భద్రత సవాళ్లకు చిరుధాన్యాలు పరిష్కారంగా నిలుస్తాయని ప్రధాని మోదీ శనివారం స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు కూడా ఇవి ఉపకరిస్తాయని ఆయన గుర్తుచేశారు. శనివారం ఇక్కడ ప్రారంభమైన ప్రపంచ చిరుధాన్యాల(శ్రీ అన్నం) సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. ‘‘ప్రపంచం నేడు రెండు రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. దక్షిణార్థ గోళంలో పేదలకు ఆహారం అందని పరిస్థితి కాగా, మరోవైపు ఉత్తరార్థ గోళంలో అనారోగ్యకరమైన ఆహారానికి సంబంధించిన సమస్యలున్నాయి. వీటికి శ్రీ అన్నం పరిష్కారాన్ని అందిస్తుంది’’ అని మోదీ అన్నారు. యూఎన్‌ ప్రకటనను పురస్కరించుకుని రూ.75 రూపాయల నాణాన్ని ప్రధాని శనివారం విడుదల చేశారు. కాగా.. చిరుధాన్యాలను పండించేందుకు గాను గయానాలో 200 ఎకరాల భూమిని కేటాయించనున్నామని ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ శనివారం ప్రకటించారు.

Updated Date - 2023-03-19T01:26:13+05:30 IST