ఒడిశాలో పిడుగులకు 12 మంది బలి
ABN , First Publish Date - 2023-09-04T02:26:05+05:30 IST
ఒడిశాలో శనివారం రాత్రి పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒడిశాలో 11 జిల్లాలో ఈ పిడుగుపాటుకు 12 మంది మృతి చెందారు.
సాలూరు రూరల్, సెప్టెంబరు 3: ఒడిశాలో శనివారం రాత్రి పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒడిశాలో 11 జిల్లాలో ఈ పిడుగుపాటుకు 12 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. 8 పశువులు మృత్యువాత పడ్డాయని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషన్ ఆదివారం ప్రకటించింది. ఖుర్థా జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. బోలంగీర్‌లో ఇరువురు మరణించగా 8 మంది గాయపడ్డారు. అంగుల్, బోధ్, డెంకనాల్, గజపతి, జగత్సింగ్‌పూర్, పూరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అంగుల్, కటక్, గంజాంలో ఒక్కొక్కరు చొప్పు గాయపడ్డారు. గజపతి జిల్లాలో ఆరు పశువులు, కొంథమాల్ జిల్లాలో రెండు పశువులు మృత్యువాత పడ్డాయి.