ఢిల్లీ-చెన్నై మధ్య తగ్గనున్న 300 కిలోమీటర్ల దూరం

ABN , First Publish Date - 2023-06-29T04:32:47+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో దూరం 300 కిలోమీటర్లు తగ్గనుందని కేంద్ర మంత్రి గడ్కరి వెల్లడించారు.

ఢిల్లీ-చెన్నై మధ్య తగ్గనున్న 300 కిలోమీటర్ల దూరం

సూరత-చెన్నై గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో సాధ్యం: గడ్కరీ

న్యూఢిల్లీ, జూన్‌ 28: దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో దూరం 300 కిలోమీటర్లు తగ్గనుందని కేంద్ర మంత్రి గడ్కరి వెల్లడించారు. సూరత నుంచి చెన్నైకి తాము చేపట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుందని తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేకి అనుబంధంగా ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టును చేపట్టినట్లు వెల్లడించారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో సాధించిన ప్రగతిని గడ్కరీ వెల్లడించారు. 17 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన రాయ్‌పూర్‌-విశాఖపట్టణం రహదారి పనులు 34ు, 525 కిలోమీటర్ల ఇండోర్‌- హైదరాబాద్‌ రోడ్డు పనులు 68ు పూర్తయ్యాయని గడ్కరీ తెలిపారు. నాగపూర్‌- విజయవాడ రోడ్డు పనులు 21ు, 116 కిలోమీటర్ల చిత్తూరు-థాచర్‌ రహదారి పనులు 3ు పూర్తయినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-29T06:05:03+05:30 IST