ఢిల్లీచెన్నై మధ్య తగ్గనున్న 300 కిలోమీటర్ల దూరం

ABN , First Publish Date - 2023-06-29T03:13:09+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో దూరం 300 కిలోమీటర్లు తగ్గనుందని కేంద్ర మంత్రి గడ్కరి వెల్లడించారు.

ఢిల్లీచెన్నై మధ్య తగ్గనున్న 300 కిలోమీటర్ల దూరం

● సూరత్‌చెన్నై గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో సాధ్యం

● మోదీ హయాంలో రోడ్ల నిర్మాణంలో ఏడు ప్రపంచ రికార్డులు: గడ్కరీ

న్యూఢిల్లీ, జూన్‌ 28: దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నైకి రోడ్డు మార్గంలో దూరం 300 కిలోమీటర్లు తగ్గనుందని కేంద్ర మంత్రి గడ్కరి వెల్లడించారు. సూరత్‌ నుంచి చెన్నైకి తాము చేపట్టిన గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టుతో ఇది సాధ్యం కానుందని ఆయన తెలిపారు. ఢిల్లీముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవేకి అనుబంధంగా ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టును చేపట్టినట్లు వెల్లడించారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో సాధించిన ప్రగతిని వివరించేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గడ్కరీ ఈ వివరాలను వెల్లడించారు. 17 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన రాయ్‌పూర్‌ విశాఖపట్టణం రహదారి పనులు 34%, 525 కిలోమీటర్ల ఇండోర్‌ హైదరాబాద్‌ రోడ్డు పనులు 68% పూర్తయ్యాయని గడ్కరీ తెలిపారు. నాగపూర్‌ విజయవాడ రోడ్డు పనులు 21%, 116 కిలోమీటర్ల చిత్తూరు థాచర్‌ రహదారి పనులు 3% పూర్తయినట్లు పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో మోదీ ప్రభుత్వం ఏడు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టిందని గడ్కరీ తెలిపారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యంత భారీ రహదారులు(91,287 కిలోమీటర్ల రోడ్లు) కలిగిన దేశంగా భారత్‌ నిలిచిందని ఆయన చెప్పారు. 201314లో రూ.4,770 కోట్ల టోల్‌ టాక్స్‌ వసూలైతే అదిప్పుడు రూ.41,342 కోట్లకు చేరిందన్నారు.


Updated Date - 2023-06-29T03:13:09+05:30 IST