Share News

Israel and Hamas : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం!

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:06 AM

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరోమారు కాల్పుల విరమణ ఒప్పందం జరగనుందా? బందీలు-ఖైదీల మార్పిడి జరగనుందా? ఈ ప్రశ్నలకు.. మధ్యవర్తిత్వం నెరపుతున్న ఖతార్‌ అవుననే చెబుతోంది. ఇప్పటికే హమాస్‌ అగ్రనాయకత్వాన్ని

 Israel and Hamas : ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం!

సూచనప్రాయంగా తెలిపిన ఖతార్‌.. హమాస్‌ సందేశంతో ఇజ్రాయెల్‌కు లేఖ

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య మరోమారు కాల్పుల విరమణ ఒప్పందం జరగనుందా? బందీలు-ఖైదీల మార్పిడి జరగనుందా? ఈ ప్రశ్నలకు.. మధ్యవర్తిత్వం నెరపుతున్న ఖతార్‌ అవుననే చెబుతోంది. ఇప్పటికే హమాస్‌ అగ్రనాయకత్వాన్ని ఖతార్‌కు రప్పించుకుని, విడతల వారీగా చర్చలు జరిపినట్లు శనివారం వెల్లడించింది. హమాస్‌ సందేశాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి లేఖ రూపంలో పంపినట్లు తెలిపింది. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇజ్రాయెల్‌ అధికారయంత్రాంగానికి చెందిన ముగ్గురు అధికారులు నిర్ధారించారు. వచ్చే వారాంతంలోగా ఈ చర్చలపై ఓ స్పష్టత వస్తుందని ఖతార్‌ భావిస్తోంది. మరోవైపు ఈజిప్ట్‌ కూడా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఓ ఫ్రేమ్‌వర్క్‌తో ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. మూడు దశల్లో యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనలను ఇరువర్గాల ముందు పెడతామని ఈజిప్ట్‌ భద్రత వర్గాలు పేర్కొన్నట్లు రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే.. గతంలోనే ఇజ్రాయెల్‌ పెట్టిన షరతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆ కథనం చెబుతోంది. గాజా స్ట్రిప్‌లో కాల్పుల విరమణ తర్వాత.. అధికార పీఠాన్ని హ మాస్‌ గానీ, ఇస్లామిక్‌ జిహాద్‌ సంస్థ గానీ చేపట్టకూడదని.. పాలస్తీనా అథారిటీకి బాధ్యతలను అప్పగిస్తామని అప్పట్లో ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది. ఈ షరతును హమాస్‌ తోసిపుచ్చింది. ఈజిప్ట్‌ పేర్కొన్న ‘మూడు దశల్లో కాల్పుల విరమణ’ ప్రతిపాదనపై చర్చించేందుకు హమాస్‌ ప్రతినిధి బృందం శుక్రవారం కైరోలో పర్యటించినట్లు ఏఎ్‌ఫపీ ఏజెన్సీ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా గురువారం బందీల కుటుంబ సభ్యులతో మా ట్లాడుతూ.. మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నాయ ని, ఇంతకుమించి వివరాలు చెప్పలేనని తెలిపారు.

2gun11.jpg

ఇజ్రాయెల్‌కు అమెరికా ఆయుధాలు

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా కోరుతూనే.. మరోపక్క ఇజ్రాయెల్‌కు ఆయుధాలను సరఫరా చేయడానికి అంగీకరించింది. 155ఎంఎం షెల్స్‌కు సంబంధించిన ఫ్యూజ్‌లు, చార్జర్లు, పైమర్లను సరఫరా చేయడానికి బైడెన్‌ సర్కారు ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి కాంగ్రెస్‌ ఆమోదం లేకున్నా.. అమెరికా ముందుకు సాగుతుండడం గమనార్హం. ఈ డీల్‌ విలువ రూ. 1,227 కోట్లు(147.5 మిలియన్‌ డాలర్లు) అని అమెరికా రక్షణ మంత్రి బ్లింకెన్‌ వెల్లడించారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Dec 31 , 2023 | 04:07 AM