సైన్యం రక్షణలో దేశం భద్రం
ABN , First Publish Date - 2023-11-14T04:20:15+05:30 IST
ప్రధాని మోదీ దీపావళి పండుగను ఈ ఏడాది కూడా సైనికులతోనే జరుపుకొన్నారు. ఆదివారం ఉదయమే ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాలో ఉన్న సైనిక క్యాంపునకు
శాంతి స్థాపనలో వారి పాత్ర గొప్పది: మోదీ
న్యూఢిల్లీ, నవంబరు 12: ప్రధాని మోదీ దీపావళి పండుగను ఈ ఏడాది కూడా సైనికులతోనే జరుపుకొన్నారు. ఆదివారం ఉదయమే ఆయన హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాలో ఉన్న సైనిక క్యాంపునకు వెళ్లారు. సైన్యానికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఉన్న సైనికులకు స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారతదేశం నుంచి ప్రపంచం ఎంతో ఆశిస్తోందని చెప్పారు. ఇలాంటి కీలక సమయంలో సరిహద్దుల్లో, దేశంలో శాంతిని కాపాడటంతో భద్రతా బలగాల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. ఇంతటి ఽధైర్యసాహసాలు గల సైనికులు సరిహద్దుల్లో రక్షణగా నిలబడి ఉన్నంత కాలం దేశం భద్రంగా ఉంటుందని చెప్పారు. దేశం వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటుందన్నారు.