Mia Khalifa : నిలువు కాదు.. వీడియోలు అడ్డంగా తీయండి
ABN , First Publish Date - 2023-10-11T03:28:53+05:30 IST
‘‘దాడులకు సంబంధించిన దృశ్యాలు సరిగా కనిపించడం లేదు. ఫోన్లను నిలువుగా కాదు.. అడ్డంగా పట్టుకుని వీడియోలు తీయమని పాలస్తీనా సమరయోధులకు
హమాస్‌లు స్వాతంత్య్ర సమరయోధులు: మియా ఖలీఫా
జెరూసలెం, అక్టోబరు 10: ‘‘దాడులకు సంబంధించిన దృశ్యాలు సరిగా కనిపించడం లేదు. ఫోన్లను నిలువుగా కాదు.. అడ్డంగా పట్టుకుని వీడియోలు తీయమని పాలస్తీనా సమరయోధులకు చెప్పండి. హమా్‌సలు స్వాతంత్య్ర సమరయోధులు. మీరు పాలస్తీనాలో పరిస్థితులను చూసి కూడా వారి వైపు నిలవకుంటే.. వర్ణ వివక్షను సమర్థించినట్లే’’ అంటూ మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేసిన ట్వీట్లు తీవ్ర వివాదం రేపాయి. ఇజ్రాయెల్ ప్రజలను బందీలుగా పట్టుకున్న హమా్‌సలు.. మహిళలను నగ్నంగా ఊరేగించారు. అత్యాచారాలకూ పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు మొదలైన 7వ తేదీనే మియా ఖలీఫా ట్వీట్ చేశారు. లెబనాన్ జాతీయురాలైన మియా ఖలీఫా చేసిన ట్వీట్లపై నెటిజన్లు మండిపడ్డారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనడాకు చెందిన బ్రాడ్ కాస్టర్, రేడియో హోస్ట్ టాడ్ మైఖేల్ షాపిరో తన పాడ్‌కాస్ట్ డీల్ నుంచి మియా ఖలీఫాను తప్పించారు. మరో సంస్థ ప్లేబాయ్ సైతం మియాతో ఒప్పందం రద్దు చేసుకుంది. అయితే, తన ట్వీట్లపై ఆమె వెనక్కుతగ్గలేదు. యూదు భావజాలం ఉన్నవారితో ఒప్పందం చేసుకునే ముందు ఆలోచించకపోవడంపై తనపై తనకే కోపం వస్తోందని పేర్కొంది.