అయోధ్యకు స్టార్ హోటళ్ల వలస!
ABN , First Publish Date - 2023-05-01T04:24:22+05:30 IST
అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో..మున్ముందు అక్కడి పర్యాటక రంగంలో లభించే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను ప్రముఖ స్టార్ హోటళ్లు నగరానికి..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో..మున్ముందు అక్కడి పర్యాటక రంగంలో లభించే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు గాను ప్రముఖ స్టార్ హోటళ్లు నగరానికి క్యూ కడుతున్నాయి. అయోధ్యలో తమ శాఖల్ని తెరిచేందుకు పోటీ పడుతున్నాయి. తాజ్, రాడిసన్, ఐటీసీ వంటి ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి ఒయో తరహా బడ్జెట్ సంస్థలు వరకూ వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం అయోధ్యకు ఏటా 2 కోట్లమంది పర్యాటకులు వస్తుండగా..2031 కల్లా ఈ సంఖ్య 4 కోట్లకు చేరనుందని అంచనా. ప్రస్తుతం నగరంలో కేవలం 17 హోటళ్లు, 600 గదులు మాత్రమే ఉన్నాయి.