Oxfam India: కరోనాలోనూ 121 శాతం సంపద పెంచుకున్న కార్పొరేట్లు, 35 కోట్ల మంది పేదరికంలోకి..

ABN , First Publish Date - 2023-01-16T14:46:26+05:30 IST

భారతదేశంలో ధనికులకు, పేదలకు మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకుని బిలియనీర్లుగా మారుతుంటే..

Oxfam India: కరోనాలోనూ 121 శాతం సంపద పెంచుకున్న కార్పొరేట్లు, 35 కోట్ల మంది పేదరికంలోకి..

న్యూఢిల్లీ: భారతదేశంలో ధనికులకు, పేదలకు మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోంది. కోటీశ్వరులు, అత్యంత ధనికులు మరింత సంపద పోగేసుకుని బిలియనీర్లుగా మారుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని, అంతకంతకూ పెరుగుతున్న ఈ అంతరాన్ని తగ్గించాలంటే ప్రగతిశీలక పన్ను చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని 'ఆక్స్‌ఫాం ఇండియా' (Oxfam India) తాజా నివేదిక తెలిపింది. ''సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా సప్లిమెంట్'' (Survival of the Richest: The india Supplement) పేరుతో వెలువరించిన ఈ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. దావోస్‌లో జరిగిన 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరం తొలి రోజు ''సర్వైవల్ ఆఫ్ ది రిచెర్ట్)ను పబ్లిష్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా గత 25 ఏళ్లలో తొలిసారిగా సంపద, పేదరికం మధ్య అంతరం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండటంపై స్విష్ స్కై రిసార్ట్‌లో జరిగిన దావోస్ సమావేశం కీలకంగా చర్చించింది.

osfarm-india1.jpg

'సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా సప్లిమెంట్'లో వెల్లడైన కీలక అంశాల ప్రకారం, 2021లోని మొత్తం భారతదేశ సంపదంలో 40.5 శాతం సంపద ఒక శాతం వ్యక్తుల వద్దే ఉంది. జనాభాలో అట్టడుగున్న ఉన్న 50 శాతం మందికి జాతీయ సంపదంలో దక్కిన వాటా 3 శాతం మాత్రమే. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి 2022 నవంబర్ వరకు ఇండియాలోని బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. అంటే రోజుకు రూ.3,608 కోట్లు పెరిగింది. ఆ ప్రకారం వారి సంపాదన ప్రతి నిమిషానికి రూ.2.5 కోట్లు పెరిగింది. కోటీశ్వరులు మరింత కోటీశ్వరులుగా మారుతుండగా, ఆకలితో ఉన్న భారతీయులు (Hundgry Indians) 19 కోట్ల నుంచి 35 కోట్లకు పెరిగారు.

కాగా, 'ఆక్స్‌ఫాం ఇండియా' గత ఏడాది నివేదకలోనూ ధనికులు, పేదల మధ్య అంతరాన్ని 'ఇనీక్వాలిటీ కిల్స్' పేరుతో వెల్లడించింది. కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న 2021లో శతకోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కు పెరిగిందని, ఇదే కోవిడ్ సంభోభంలో 4.6 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయారని పేర్కొంది. అత్యంత ధనికులు, శకకోటీశ్వరులపై సంపద పన్ను పెంచాలని సూచించింది. కనీసం 1 శాతం పన్నుగా ప్రభుత్వానికి లభించినా అది రూ.50 వేల కోట్లు అవుతుందని, ఆ డబ్బులో దేశ ప్రజలందిరికీ ఉచితంగా వాక్సిన్ అందించవచ్చని, 4 శాతం పన్ను వెస్తే రెండేళ్ల హెల్త్ బడ్జెట్‌కు సరిపోతుందని నివేదకలో పేర్కొంద

Updated Date - 2023-01-16T14:56:54+05:30 IST