Special trains: సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2023-01-05T10:20:44+05:30 IST

సంక్రాంతి రద్దీని క్రమబద్ధీకరించేందుకు తాంబరం - న్యూ టిన్సుకియా మధ్య ప్రత్యేక రైళ్లను(Special trains) నడపనున్నట్లు దక్షిణరైల్వే

Special trains: సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు

చెన్నై, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి రద్దీని క్రమబద్ధీకరించేందుకు తాంబరం - న్యూ టిన్సుకియా మధ్య ప్రత్యేక రైళ్లను(Special trains) నడపనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ ఉదయం 10.45 గంటలకు తాంబరం నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు (నెంబరు:06073).. మూడో రోజు రాత్రి 7.35 గంటలకు టిన్సుకియాకు చేరుకుంటుంది. తిరిగి అదే రైలు (నెంబరు: 06074) ఈ నెల 11వ తేదీ రాత్రి 8.20 గంటలకు న్యూ టిన్సుకియాలో బయలుదేరి నాలుగో రోజు ఉదయం 5.45 గంటలకు తాంబరం చేరుకుంటుంది. 2 ఏసీ త్రీటైర్‌, 13 స్లీపర్‌, 6 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 లగేజ్‌ కం బ్రేక్‌ వ్యాన్లు కలిగిన ఈ రైలు ఎగ్మూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపూర్‌, ఖుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రఖ్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌, డంకుని, బర్దమాన్‌, రాంపుర్హట్‌, మైదా టౌన్‌, కిషన్‌గంజ్‌, న్యూ జల్పైగురి, జల్పైగురి రోడ్‌, మాతాభంగా, న్యూ కోచ్‌ బేహార్‌, న్యూ అలిపుర్దువర్‌, కోక్రాజ్‌హర్‌, న్యూ బొంగైగాన్‌, గోల్పారా టౌన్‌, గువహటి, జాగి రోడ్‌, హోజై, లండింగ్‌, దుఫు, డిమాపూర్‌, ఫర్కటింగ్‌, మరియాని, సిమలుగురి, నహర్కాటియా స్టేషన్లలో ఆగుతుంది. గురువారం ఉదయం 8 గంటల నుంచే రైళ్లకు రిజర్వేషన్‌ ప్రారంభమవుతుందని దక్షిణరైల్వే ప్రకటించింది.

హతియా నుంచి బెంగుళూరుకు....

హతియా నుంచి ఎస్‌ఎంవీటీ బెంగుళూరుకు ప్రత్యేక రైలును నడపున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 4.50 గంటలకు హతియాలో బయలుదేరే ప్రత్యేక రైలు (నెంబరు:08887) మరునాడు రాత్రి 8 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. 2 ఏసీ టూటైర్‌, 3 ఏసీ త్రీటైర్‌, 15 స్లీపర్‌క్లాస్‌, 2 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, 2 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ (దివ్యాంగులకు) బోగీలతో కూడిన ఈ రైలు రూర్కేలా, జార్సుగుడ, సంభల్‌పూర్‌, బర్గారోడ్‌, బలంగిర్‌, టిట్లాగడ్‌, కేసింగా, మునిగుడ, రాయఘడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, సింహాచలం, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్‌, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట స్టేషన్లలో ఆగుతుంది.

టాటానగర్‌ నుంచి బెంగుళూరుకు

టాటా నగర్‌ నుంచి ఎస్‌ఎంవీటీ బెంగుళూరుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణరైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 4.50 గంటలకు టాటాలో బయలుదేరే ప్రత్యేక రైలు (నెంబరు: 08885) మూడో రోజు రాత్రి 8 గంటలకు ఎస్‌ఎంవీటీ బెంగుళూరు చేరుకుంటుంది. 2 ఏసీ టూటైర్‌, 3 ఏసీ త్రీటైర్‌, 15 స్లీపర్‌, 2 జనరల్‌, 2 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ (దివ్యాంగులకు) బోగీలు కలిగిన ఈ రైలు సిని, చక్రధర్‌పూర్‌, గోయిల్కేరా, జరైకేలా, రూర్కేలా, రాజ్‌గంగ్‌పూర్‌, జార్సుగూడ, సంభల్‌పూర్‌, బర్గారోడ్‌, బలంగిర్‌, టిట్లాఘడ్‌, కేసింగా, మునిగూడ, రాయగఢ, పార్వతిపురం, బొబ్బిలి, విజయనగరం, సింహాచలం, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, పెరంబూర్‌, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట స్టేషన్లలో ఆగుతుంది.

Updated Date - 2023-01-05T10:20:46+05:30 IST