Share News

Viral Video: చైనాలో మంచు బీభత్సం.. మంచు తుఫానుకు విద్యార్థులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూడండి..

ABN , Publish Date - Dec 23 , 2023 | 06:58 PM

ఉత్తర చైనాలో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. భీకరంగా వేస్తున్న మంచు గాలులు వణికిస్తున్నాయి. అంత మంచు తుఫానులోనూ విద్యార్థులు ఉల్లాసంగా విద్యాలయాలకుహాజరవుతున్నారు. మంచు తుఫాను ధాటికి పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Viral Video: చైనాలో మంచు బీభత్సం.. మంచు తుఫానుకు విద్యార్థులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో చూడండి..

ఉత్తర చైనాలో (China) మంచు తుఫాను (Snowstorm) అల్లకల్లోలం సృష్టిస్తోంది. భీకరంగా వేస్తున్న మంచు గాలులు వణికిస్తున్నాయి. అంత మంచు తుఫానులోనూ విద్యార్థులు (Students) ఉల్లాసంగా విద్యాలయాలకు హాజరవుతున్నారు. మంచు తుఫాను ధాటికి పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే విశ్వ విద్యాలయాలు మాత్రం 75 శాతం హాజరును తప్పనిసరి చేయడంతో అంత మంచు తుఫానులోనూ విద్యార్థులు క్యాంపస్‌లకు వెళ్తున్నారు (Viral Video).

ఆ భయంకర వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మంచుతో నిండిన మార్గాల్లో కొందరు విద్యార్థులు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నారు. గాలి తాకడికి చెట్లు ఊగిపోవడమే కాదు.. ప్రజలు కూడా పడిపోతున్నారు. మరికొందరు మాత్రం ఆ మంచులో ఉల్లాసంగా స్కీయింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా, ఉత్తర చైనా పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపుతున్న వీడియో బాగా వైరల్ అవుతోంది. కొన్ని లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు.

``నాకు గుర్తున్నంత వరకు చైనాలో ఇంత మంచు తుఫాను ఎప్పుడూ లేదు``, ``అలాంటి పరిస్థితుల్లో దయచేసి ఇళ్లలో ఉండండి``, ``చూడడానికి ఇది నెదర్లాండ్స్‌లా ఉంది``, ``చాలా అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. అందరూ జాగ్రత్త`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Dec 23 , 2023 | 06:58 PM