ఔరంగజేబుపై నినాదాలంటూ తప్పుడు ప్రచారం!
ABN , First Publish Date - 2023-06-26T01:08:13+05:30 IST
మహారాష్ట్రలో తాను నిర్వహించిన ర్యాలీలో కొంతమంది ఔరంగజేబుకు మద్దతుగా నినాదాలు చేసినట్లు కొన్ని వార్తా చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.....
ఆ చానళ్లపై కేసు పెడతా: అసదుద్దీన్ ఒవైసీ
అమరావతి, జూన్ 25: మహారాష్ట్రలో తాను నిర్వహించిన ర్యాలీలో కొంతమంది ఔరంగజేబుకు మద్దతుగా నినాదాలు చేసినట్లు కొన్ని వార్తా చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆ చానళ్లపై చ ట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆదివారం హెచ్చరించారు. ‘‘మీరు అబద్ధాలు ప్రసారం చేస్తున్నారు. ముస్లింలను ఎంతగా ద్వేషిస్తారు? మీపై కేసులు పెడతా’’ అని ఒవైసీ తెలిపారు. అంతకుముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్ స్పందిస్తూ..‘‘రాష్ట్రంలోకి ఒక్కసారిగా ఔరంగజేబు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ఆదేశాల ప్రకారం ఎవరు ఆ నినాదాలు చేశారో త్వరలోనే తెలుస్తుంది’’ అని అన్నారు.