మెఫ్తాల్ పెయిన్ కిల్లర్లతో దుష్ప్రభావం
ABN , First Publish Date - 2023-12-08T03:07:44+05:30 IST
మెఫ్తాల్ బ్రాండ్ పేరుతో విక్రయించే పెయిన్ కిల్లర్ మెఫెనామిక్ యాసిడ్ వాడకంపై వైద్యులు, రోగులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల దుష్ప్రభావాలు ..
వైద్యులు, రోగులకు కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ, డిసెంబరు 7: మెఫ్తాల్ బ్రాండ్ పేరుతో విక్రయించే పెయిన్ కిల్లర్ మెఫెనామిక్ యాసిడ్ వాడకంపై వైద్యులు, రోగులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనివల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయని ఫార్మా స్టాండర్డ్ బాడీ ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ (ఐపీసీ) డ్రగ్ సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది. ఔషధాల రియాక్షన్స్‌పై సమాచారం సేకరించే ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా (పీవీపీఐ) తన ప్రాథమిక విశ్లేషణలో మెఫెనామిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు.. ఇసినోఫిలియా, డ్రెస్ అని పిలవబడే లక్షణాలతో ప్రతిచర్యను ప్రేరేపిస్తుందని గుర్తించింది. మెఫెనామిక్ యాసిడ్‌ను భారత్‌లో ఎక్కువగా రుతుస్రావ నొప్పులు, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులకు వాడతారు. అధిక జ్వరం ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఈ మందును విచ్చలవిడిగా వాడుతుంటారు. కాగా, ఈ ట్యాబ్లెట్లు వాడితే సైడ్‌ఎఫెక్స్ వస్తాయన్న సంగతి వాస్తవమే అయినా.. ఇది చాలా అరుదని, వ్యక్తులను బట్టి వీటి ప్రభావం ఉంటుందని కొందరు వైద్యులు వెల్లడించారు.