జైలు నుంచే పాలించాలా.. రాజీనామా చేయాలా?
ABN , First Publish Date - 2023-11-18T05:00:14+05:30 IST
మద్యం కుంభకోణం కేసులో తాను అరెస్టయితే రాజీనామా చేయాలా? జైలు నుంచే పాలన సాగించాలా? అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కోరారు.
ప్రజాభిప్రాయ సేకరణకు కేజ్రీ ఆదేశం
న్యూఢిల్లీ, నవంబరు 17: మద్యం కుంభకోణం కేసులో తాను అరెస్టయితే రాజీనామా చేయాలా? జైలు నుంచే పాలన సాగించాలా? అన్న అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కోరారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తాను రాజీనామా చేయాలా వద్దా అనే అంశంపై.. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి, ప్రజలతో మాట్లాడి అభిప్రాయాన్ని సేకరించాలని, బీజేపీ కుట్రలను వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడా చర్చిస్తున్నానని తెలిపారు. తనకు సీఎం పదవిపై అమితమైన ఆపేక్ష లేదన్నారు. గతంలో 49 రోజుల్లోనే ఎవరూ అడక్కుండానే సీఎం పదవికి రాజీనామా చేశానని అన్నారు.