Share News

26న నేవీలోకి ‘ఇంఫాల్‌’ నౌక

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:38 AM

భారత నావికాదళంలోకి మరో నౌకాస్త్రం చేరనుంది. క్షిపణి విధ్వంసక నౌక ‘ఇంఫాల్‌’ ఈ నెల 26న నేవీలోకి అడుగుపెట్టనుంది. విశాఖపట్నం-క్లా్‌సకు చెందిన ఈ మూడవ క్షిపణి

26న నేవీలోకి ‘ఇంఫాల్‌’ నౌక

న్యూఢిల్లీ, డిసెంబరు 17: భారత నావికాదళంలోకి మరో నౌకాస్త్రం చేరనుంది. క్షిపణి విధ్వంసక నౌక ‘ఇంఫాల్‌’ ఈ నెల 26న నేవీలోకి అడుగుపెట్టనుంది. విశాఖపట్నం-క్లా్‌సకు చెందిన ఈ మూడవ క్షిపణి విధ్యంసక నౌకను ముంబైలో నేవీకి అప్పగించనున్నారు. ఇప్పటి వరకు తయారు చేసిన అతిపెద్ద క్షిపణి విధ్వంసక నౌకలలో ఒకటిగా ఉన్న దీన్ని మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) రూపొందించింది. దీనిలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ సబ్‌మెరైన్‌ ఆయుధాలు, హెవీ వెయిట్‌ టార్పెడో ట్యూబ్‌ లాంచర్లు, ఏఎ్‌సడబ్ల్యూ రాకెట్‌ లాంచర్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. హిందూమహాసముద్ర ప్రాంతంలో భారత రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ నౌక ఉపయోగపడనుంది.

Updated Date - Dec 18 , 2023 | 06:49 AM