Selection of Oscar Awards : విజేతల ఎంపిక ఎలా జరుగుతుంది?

ABN , First Publish Date - 2023-03-14T04:08:18+05:30 IST

ఆస్కార్‌ అవార్డుల ఎంపిక ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ లో దాదాపు పది వేల మంది సభ్యులు ఉన్నారు. విమర్శలు తలెత్తకుండా..

Selection of Oscar Awards : విజేతల ఎంపిక ఎలా జరుగుతుంది?

ఆస్కార్‌ అవార్డుల ఎంపిక ఓ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ లో దాదాపు పది వేల మంది సభ్యులు ఉన్నారు. విమర్శలు తలెత్తకుండా ప్రతి ఏడాది సభ్యుల సంఖ్య పెంచుతుంటారు. ప్రలోభాలకు, రికమండేషన్స్‌కు ఇక్కడ అవకాశమే లేదు. మూడంచెల విధానంలో అవార్డుల ఎంపిక జరుగుతుంది. సీక్రెట్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా అవార్డులను ఎంపిక చేస్తారు. ఎంట్రీలుగా వచ్చిన చిత్రాలను షార్ట్‌ లిస్ట్‌ చేయడం, ఫైనల్‌ నామినేషన్స్‌ ఎంపిక చేయడం, వాటిల్లోంచి విజేతను ఎన్నుకోవడం.. ఇదీ జరిగే పద్ధతి. ఏ విభాగానికి చెందిన వారు ఆ విభాగానికి చెందిన నామినేషన్స్‌ ఫైనల్‌ చేస్తుంటారు. ఉత్తమ చిత్రానికి మాత్రం వీరందరూ కలసి ఓటు వేస్తారు. ప్రతి విభాగంలోనూ ఎక్కువ ఓట్లు వచ్చిన నామినేషన్‌కే అవార్డ్‌ లభిస్తుందనేది బహిరంగ రహస్యమే. ఓట్టు లెక్కిస్తున్నప్పుడు ఫస్ట్‌ రౌండ్‌లో ఓ చిత్రానికి 50 శాతం పైగా ఓట్లు వస్తు ఆ సినిమాను ఉత్తమ చిత్రంగా నిర్ణయిస్తారు.

ఒక వేళ ఓ సినిమాకు తగినన్ని ఓట్లు ఫస్ట్‌ రౌండ్‌లో రాకపోతే ఆ చిత్రానికి పోలయిన ఓట్లు తొలగిస్తారు. అప్పుడు ఆ సినిమాకు ఓటు వేసిన సభ్యులు తమ ఓట్లను మరో సినిమాకు ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉంటుంది. ఓ చిత్రానికి మెజారిటీ ఓట్లు వచ్చే వరకూ ఇదే విధానం కొనసాగుతుంది. ప్రైజ్‌ వాటర్‌ కూపర్స్‌( పీడబ్ల్యు సీ) సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులకు మాత్రమే విజేత ఎవరో ముందు తెలుస్తుంది. విజేతల వివరాలు ఉన్న సీల్డ్‌ కవర్స్‌తో డాల్బీ థియేటర్‌లోనే వీరు ఉంటారు. 95వ ఆస్కార్‌ అవార్డుల ఎంపిక కోసం మార్చి రెండున ఓటింగ్‌ ప్రారంభించి ఐదే రోజుల్లో విజేతలను ఎంపిక చేశారు.

Updated Date - 2023-03-14T04:09:39+05:30 IST