స్వలింగ పెళ్లిళ్లు సమ్మతం కాదు

ABN , First Publish Date - 2023-03-31T03:25:43+05:30 IST

స్వలింగ వివాహాలను గుర్తించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. దేశంలోని పలు మైనారిటీ మత సంస్థలు కూడా ఇప్పుడు అదే బాట పట్టాయి. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించవద్దంటూ సుప్రీంకోర్టు ..

స్వలింగ పెళ్లిళ్లు సమ్మతం కాదు

చట్టబద్ధత వద్దని సుప్రీం చీఫ్‌జస్టిస్‌, రాష్ట్రపతికి

ఇస్లాం, క్రైస్తవ, జైన సంస్థల ప్రతినిధుల లేఖలు

న్యూఢిల్లీ, మార్చి 30: స్వలింగ వివాహాలను గుర్తించబోమని సుప్రీంకోర్టుకు కేంద్రం ఇప్పటికే తేల్చిచెప్పింది. దేశంలోని పలు మైనారిటీ మత సంస్థలు కూడా ఇప్పుడు అదే బాట పట్టాయి. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించవద్దంటూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు ఈ సంస్థలు వేర్వేరుగా లేఖ రాశాయి. ‘‘స్వలింగ పెళ్లళ్లకు కల్పించే ఎటువంటి చట్టబద్ధతైనా మాకు సమ్మతం కాదు. అది ఇస్లామ్‌ చట్టాలకు విరుద్ధం. దీనివల్ల మతపరమైన, సామాజికపరమైన విలువలకు విఘాతం కలుగుతుంది’’ అని సుప్రీంకు రాసిన లేఖలో అజ్మీర్‌కు చెందిన చిష్తీ ఫౌండేషన్‌ పెద్ద సయ్యద్‌ సల్మాన్‌ చిష్తీ ఆందోళన వ్యక్తంచేశారు. భారతీయ చర్చి సంస్థల సమాఖ్య పెద్ద ప్రకాశ్‌.పి.థామస్‌ ఇదే విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వివాహ చట్టాల విషయంలో యథాతథస్థితిని సుప్రీంకోర్టు కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. కుటుంబవృక్ష విస్తరణకు పెళ్లిని తాము ఆలంభనగా చూస్తామని జైన గురువు ఆచార్య లోకేశ్‌ తెలిపితే, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని పాశ్‌మందా ముస్లిం (వెనుకబడిన) సమూహ ప్రతినిధి పర్వేజ్‌ హనీఫ్‌ కోరారు.

Updated Date - 2023-03-31T03:25:43+05:30 IST