‘సమర్’ క్షిపణి పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:37 AM
రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరో కీలక ముందడుగు వేసింది. గగనతల రక్షణ కోసం రూపొందించిన ‘సమర్’ క్షిపణి వ్యవస్థను
న్యూఢిల్లీ, డిసెంబరు 17: రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరో కీలక ముందడుగు వేసింది. గగనతల రక్షణ కోసం రూపొందించిన ‘సమర్’ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. రష్యాకు చెందిన పాత ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి వ్యవస్థలను ఉపయోగించి ఐఏఎఫ్ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలిగిన సమర్ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇటీవల బాపట్లలోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో నిర్వహించిన అష్టశక్తి-2023 విన్యాసాల సందర్భంగా సమర్ క్షిపణి వ్యవస్థకు ఫైరింగ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.