Share News

India-Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక సమావేశం.. ఈ ప్రత్యేక అంశాలపై చర్చలు

ABN , First Publish Date - 2023-11-21T20:22:56+05:30 IST

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం (నవంబర్ 21వ తేదీన) విదేశాంగ మంత్రుల ఫ్రేమ్‌వర్క్ డైలాగ్‌కు సంబంధించి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో ఢిల్లీలో సమావేశం అయ్యారు. హైదరాబాద్ హౌస్‌లో ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగ్గా..

India-Australia: భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలక సమావేశం.. ఈ ప్రత్యేక అంశాలపై చర్చలు

విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం (నవంబర్ 21వ తేదీన) విదేశాంగ మంత్రుల ఫ్రేమ్‌వర్క్ డైలాగ్‌కు సంబంధించి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌తో ఢిల్లీలో సమావేశం అయ్యారు. హైదరాబాద్ హౌస్‌లో ఈ ఇద్దరి మధ్య సమావేశం జరగ్గా.. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. రెండు వైపులా కొత్త కాన్సులేట్స్, డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్స్, విద్యా రంగంలో పురోగతితో పాటు ఇతర అనేక కార్యక్రమాలపై చర్చలు జరిగినట్టు ఎస్ జైశంకర్ నొక్కి చెప్పారు. పెన్నీ వాంగ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో భాగంగా.. తమ భేటీలో చర్చించిన కీలక అంశాల గురించి ఆయన పంచుకున్నారు.

ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఊపందుకుంటోందని అన్నారు. పీఎం ఆంథోనీ అల్బనీస్ సెప్టెంబరులో జీ20 సమ్మిట్ కోసం భాతరదేశానికి వచ్చారని.. ఈ జీ20 సదస్సుకు అధ్యక్ష వహించేందుకు భారత్‌కు ఆస్ట్రేలియా బలమైన సహకారం అందించిందని.. అందుకు పెన్నీ వాంగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. 14వ విదేశాంగ మంత్రి ఫ్రేమ్‌వర్క్ డైలాగ్ ఇప్పుడే ముగిసిందన్న ఆయన.. తమ మధ్య గొప్ప సమావేశం సాగిందని, ఈ భేటీలో చాలా విషయాల గురించి చర్చించామని తెలిపారు. క్వాడ్ గురించి తాము వివరంగా చర్చించామని, కొన్నేళ్లుగా క్వాడ్ చాలా పురోగతి సాధించిందని అన్నారు. పరస్పరం సహకరించుకునే అంశాలు ఇంకా అనేకం ఉన్నాయని.. ఈ చర్చలో తాము క్వాడ్‌కు ఇంకా ఏం జోడించగలమన్న దానిపైనే ఎక్కువగా చర్చలు జరిపామని చెప్పుకొచ్చారు.


అలాగే.. భద్రతా సమస్యల గురించి విస్తృతంగా చర్చించామని, ఆస్ట్రేలియాతో పెరుగుతున్న సంబంధాన్ని పంచుకున్నామని జైశంకర్ చెప్పారు. UNCLOS (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ) వంటి సూత్రాలపై ఆధారపడిన స్వేచ్ఛా, కలుపుగోలుతనం, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్‌కు భారతదేశం & ఆస్ట్రేలియా అంకితభావాన్ని ఆయన హైలైట్ చేశారు. FATFతో సహా ఫోరమ్‌లలో సన్నిహితంగా సహకరించామని.. ప్రాంతీయ, గ్లోబల్ అంశాలను కూడా కేంద్రంగా ఉంచుతూ కూలంకషంగా చర్చించామని చెప్పారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించుకున్నామన్నారు. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థ కోసం పని చేస్తూనే ఉంటామని.. అంతర్జాతీయ జలాల్లో నావిగేషన్ స్వేచ్ఛకు మద్దతిస్తామని.. ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ అభివృద్ధికి ప్రోత్సాహిస్తామని చెప్పారు.

ఇదే సమయంలో ఆస్ట్రేలియా, కెనడా మధ్య దౌత్య సంబంధాలపై కూడా జైశంకర్ మాట్లాడారు. ఆస్ట్రేలియాతో భారత్, కెనడా దేశాలకు సత్సంబంధాలు ఉన్నాయని.. భారత్‌తో కెనడా సంబంధాలపై ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రితోనూ చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ చర్చ వెనుక ఉన్న లక్ష్యాల్లో ఒకటి.. ఆస్ట్రేలియా, కెనడా సమస్యపై భారతదేశ దృక్పథాన్ని తెలుసుకోవడం. తమ దృక్కోణంలో.. కెనడా తీవ్రవాదం, రాడికలైజేషన్‌కు స్థానం కల్పించడమే ప్రధాన సమస్య అని ఆయన వివరించారు.

Updated Date - 2023-11-21T20:22:58+05:30 IST