వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.83.5 తగ్గింపు

ABN , First Publish Date - 2023-06-02T02:51:18+05:30 IST

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (19 కిలోలు) ధర గురువారం రూ.83.5 మేర తగ్గింది. వరుసగా మూడో నెలలోనూ ఈ సిలిండర్‌ ధర తగ్గడం గమనార్హం.

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.83.5 తగ్గింపు

న్యూఢిల్లీ, జూన్‌ 1: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ (19 కిలోలు) ధర గురువారం రూ.83.5 మేర తగ్గింది. వరుసగా మూడో నెలలోనూ ఈ సిలిండర్‌ ధర తగ్గడం గమనార్హం. మరోవైపు విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధర 7 శాతం మేర తగ్గింది. తగ్గించిన ధరతో ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1,856.5 నుంచి రూ.1,773కు చేరినట్టు ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు పేర్కొన్నాయి. అయితే గృహావసరాలకు వినియోగించుకునే ఎల్పీజీ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇంతకు ముందు మార్చి1 న గృహోపయోగ సిలిండర్‌ ధరను కంపెనీలు రూ.50 మేర పెంచాయి. ఇదిలా ఉంటే.. తాజా తగ్గింపుతో ఢిల్లీలో కిలో లీటరు విమాన ఇంధనం ధర రూ.6,632.25 మేర తగ్గి రూ.89,303.09కి చేరుకుంది. విమాన ఇంధన ధరలు వరుసగా నాలుగో నెలలోనూ తగ్గాయి.

Updated Date - 2023-06-02T02:51:18+05:30 IST