Share News

పదోన్నతుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్‌

ABN , Publish Date - Dec 30 , 2023 | 04:01 AM

దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశిత వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుని పదోన్నతుల్లో రిజర్వేషన్‌ ప్రయోజనం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

పదోన్నతుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు

2016 జూన్‌ 30 నుంచి అర్హులకు..

కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, డిసెంబరు 29: దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశిత వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకుని పదోన్నతుల్లో రిజర్వేషన్‌ ప్రయోజనం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నోషనల్‌ పద్ధతిలో పదోన్నతులు కల్పించడానికి 2016 జూన్‌ 30 నుంచే అర్హులైన ఉద్యోగులను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర ప్రభు త్వ సర్వీసులు, ఉద్యోగాల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు అర్హతా ప్రమాణాల ప్రకారం గ్రూప్‌-ఏలో అత్యల్ప స్థాయి వరకూ రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు ఈ ఉత్తర్వులు పంపింది. 2016 జూన్‌ 30 నుంచి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి, సీనియార్టీ ప్రకారం సర్దుబాటు చేయడానికి సూపర్‌న్యూమెరరీ పోస్టులు సృష్టించాలని ప్రతిపాదించింది. దీనిపై అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కసరత్తు చేయాలని సూచించింది.

Updated Date - Dec 30 , 2023 | 04:02 AM