ఆ పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించండి

ABN , First Publish Date - 2023-09-22T02:48:09+05:30 IST

భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల (కర్నూ లు) ఉదంతంలో ఆమె మరణాన్ని చులకన చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి డానియల్‌

ఆ పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించండి

జాహ్నవి ఉదంతంలో అడెరెర్‌పై చర్యలకు సిఫారసు

సియాటెల్‌, సెప్టెంబరు 21: భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల (కర్నూ లు) ఉదంతంలో ఆమె మరణాన్ని చులకన చేస్తూ మాట్లాడిన పోలీసు అధికారి డానియల్‌ అడెరెర్‌పై చర్యలు తీసుకోవాలని సియాటెల్‌ కమ్యూనిటీ పోలీస్‌ కమిషన్‌ గట్టిగా సిఫారసు చేసింది. అడెరెర్‌ను విధుల నుంచి తప్పించి, అతని జీతభత్యాలను నిలిపివేయాలంటూ సియాటెల్‌ పోలీస్‌ చీఫ్‌ ఆడ్రియన్‌ డియాజ్‌కు లేఖ రాసింది. 21మంది సభ్యులు, వారు నియమించుకున్న మరో ముగ్గురితో కలిపి మొత్తం 24 మంది సభ్యులు కలిగిన ఈ కమిషన్‌ బుధవారం సమావేశమైంది. సియాటెల్‌ పోలీసు విభాగంపై పదేపదే ఫిర్యాదులు వస్తుండటాన్ని సీరియ్‌సగా తీసుకుంది. ముఖ్యంగా జాహ్నవి ఉదంతంలో సియాటెల్‌ పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడింది. ఇందుకు కారణమైన దర్యాప్తు అధికారి అడెరెర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సియాటెల్‌ పోలీస్‌ చీఫ్‌కు సూచిస్తూ లేఖ రాసింది.

Updated Date - 2023-09-22T02:48:09+05:30 IST