Ravi Shankar: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ హెలికాప్టర్‌కు తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2023-01-26T07:50:35+05:30 IST

ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌(Ravi Shankar)కు ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణం

Ravi Shankar: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ హెలికాప్టర్‌కు తప్పిన ముప్పు

చెన్నై, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌(Ravi Shankar)కు ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం పులుల అభయారణ్యం సమీపంలో ఉన్న ఉక్కినియం గ్రామ పాఠశాల మైదానంలో అత్యవసరంగా ల్యాండయింది. వివరాలిలా ... తిరుప్పూరు జిల్లా గాంగేయంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రవిశంకర్‌ హెలికాప్టర్‌లో బయలుదేరారు. బుధవారం ఉదయం 10.40 గంటలకు ఈరోడ్‌ మీదుగా వెళ్తుండగా దట్టమైన మబ్బులు కమ్మేశాయి. ప్రతికూల వాతావరణంలో ఏమాత్రం ముందుకు వెళ్లలేమని గ్రహించిన పైలెట్‌ హెలికాప్టర్‌(Helicopter)ను అత్యవసరంగా కిందకు దింపారు. సత్యమంగళం అడవులకు 20 కి.మీటర్ల దూరంలో వున్న ఓ స్కూలు మైదానంలో హెలికాప్టర్‌ దిగడాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి పరుగులు తీశారు. హెలికాప్టర్‌ నుంచి దిగిన రవిశంకర్‌.. కొద్దిసేపు గ్రామస్తులతో మాట్లాడారు. పావుగంట తరువాత వాతావరణం అనుకూలించడంతో హెలికాప్టర్‌ గమ్యస్థానానికి బయలుదేరింది. ఇందులో రవిశంకర్‌తో పాటు మొత్తం ఆరుగురున్నట్లు స్థానికులు తెలిపారు.

Updated Date - 2023-01-26T07:50:37+05:30 IST