విశేష పరిశోధకులకు రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌

ABN , First Publish Date - 2023-09-22T02:47:35+05:30 IST

శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు

విశేష పరిశోధకులకు రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో విశేష ప్రతిభ చూపించే వారికి అత్యంత ఉన్నతమైన రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కార్‌ల పేరుతో అవార్డులు ఇవ్వాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు వివిధ విభాగాలు ఇస్తున్న సుమారు 300 అవార్డులను రద్దు చేసి నూతనంగా ఈ అవార్డులకు రూపకల్పన చేసింది. దీని ప్రకారం విజ్ఞాన్‌ రత్న, విజ్ఞాన్‌ శ్రీ, విజ్ఞాన్‌ యువ-శాంతి స్వరూప్‌ భట్నాగర్‌, విజ్ఞాన్‌ టీం పేరుతో నాలుగు రకాల పురస్కారాలను ప్రదానం చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన శాస్త్ర రంగాల సలహాదారు ఆధ్వర్యంలోని బృందం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. విదేశాల్లోని భార త సంతతి వారు కూడా వీటికి అర్హులే. ప్రయివేటు, ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నవారితో పాటు వ్యక్తిగతంగా పరిశోధనలు చేసేవారిల్లో అర్హులను గుర్తిస్తారు.

Updated Date - 2023-09-22T02:47:35+05:30 IST