కైలాస దేశ ప్రధానిగా నటి రంజిత?
ABN , First Publish Date - 2023-07-06T01:35:33+05:30 IST
దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద.. తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిగా
చెన్నై, జూలై 5 (ఆంధ్రజ్యోతి): దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద.. తాను సృష్టించుకున్న ‘కైలాస దేశ’ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను ప్రధానిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కలకలం రేపుతోంది. ఆ వెబ్‌సైట్‌లో రంజిత చిత్రం దిగువన ‘నిత్యానందమయి స్వామి’ అనే పేరుందని, దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైన కైలాసదేశ ప్రధానిగా పేర్కొని ఉందని వివరించింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కోవలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.